Sc on Stray Dogs: ఢిల్లీలో కుక్కల బెడద ఎక్కువగా ఉండడం, రేబిస్ వంటి కారణాలతో ప్రజలు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తూ కుక్కలను దూరంగా షెల్టర్లకు తరలించాలని ఒక్కటి కూడా ఉండకూడదని సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు. స్థానికంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని, టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. రోజురోజుకు సైన్స్, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్టుగా వ్యాఖ్యానించారు. సినీ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) స్పందిస్తూ, కోర్టు తర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం
పునరాలోచించాలని కోరారు. నటుడు జాన్ అబ్రహం(John Abraham) అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాశారు. కుక్కలు ఎంతో విశ్వాసంతో ఉంటయని గుర్తు చేశారు. వాటిని పూర్తిగా తరలించడానికి బదులు స్టెరిలైజేషన్, టీకాలు వేయించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు. మరో నటుడు అడవి శేష్ స్పందిస్తూ, సీజేఐ జస్టిస గవాయ్‌కు లేఖ రాశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాసినట్టు తెలిపారు. మిగిలిన జంతు ప్రేమికులు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం తెలిపారు.
Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు సీవీఐ వ్యాధి.. లక్షణాలు ఇవే