Donald Trump: ఎంతో హుషారుగా ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump:), క్రోనిక్ వెనస్ ఇన్సఫిషియెన్సీ (CVI) అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఈ వ్యాధి నిర్ధారణ అయ్యినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. ఈ వ్యాధి కారణంగా గత కొన్ని వారాలుగా ఆయన కొద్దిగా ఇబ్బందిపడుతున్నారు. ఆయన కాళ్లలో స్వల్ప సమస్యలు ఎదురవుతున్నాయి. మడమల వద్ద వాపు, చేతులపై గాయాల మాదిరిగా కనిపించే నీలం రంగు మచ్చ లేదా బొట్టు ఏర్పడ్డాయి. గాయం కాకుండానే గాయం మాదిరిగా చేతిపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని ఫొటోలు, వీడియోల్లో ఈ మచ్చలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ, వైద్య పరీక్షల్లో ట్రంప్‌కు సీవీఐ ఉన్నట్టు నిర్ధారణ అయిందని చెప్పారు.
అసలేంటీ సీవీఐ?, లక్షణాలు ఏంటి?
క్రోనిక్ వెనస్ ఇన్సఫిషియెన్సీ అనేది శరీరంలో నెలకొనే ఒక అనారోగ్య స్థితి. కాళ్ల నరాలు రక్తాన్ని తిరిగి గుండెకు పంపించడంలో సమస్యలు ఎదుర్కొంటాయి. రక్త ప్రవాహం సరిగా లేకపోవడంతో కాళ్లలోని నరాలలో రక్తం చేరిపోతుంది. పర్యావసానంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. నరాల వ్యాధిగా దీనిని వైద్యులు వర్గీకరిస్తారు. సీవీఐ సోకితే కాలక్రమేణా కాళ్లు, మడమల్లో వాపు, నొప్పి వస్తాయి. చర్మంలో కూడా మార్పులు సంభవిస్తాయి. కాళ్లు, మడమల్లో వాపు సాధారణ లక్షణాలుగా ఉంటాయి. కాళ్ల నొప్పి, తిమ్మిరిపట్టడం, దురద, చర్మంపై పుండ్లు, కాళ్లు, చేతుల రంగు మార్పులు ఉంటాయి. ఈ తరహా లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నిర్లక్ష్యం వొద్దు
సీవీఐ వ్యాధికి సంబంధించిన లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. వయస్సు మళ్లడం కారణంగా వస్తున్నాయనే ఉద్దేశంతో పెద్దగా పట్టించుకోరు. కానీ, సరైన సమయంలో వైద్యులను సంప్రదించి, డోప్లర్ అల్ట్రాసౌండ్ వంటి సులభమైన టెస్ట్ ద్వారా సీవీఐని త్వరగా గుర్తించవచ్చు. తద్వారా తగిన చికిత్స కూడా తీసుకోవచ్చు. సీవీఐ సమస్య వయసు పెరిగేకొద్దీ ఎక్కువవుతుంది. ముఖ్యంగా 50 ఏళ్ల పైబడినవారికి వస్తుంది. మహిళలతో పాటు రక్తనాళ సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నవారికి కూడా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also- School Holidays: ఏపీ, తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
మహిళలు గర్భంతో ఉన్న సమయంలో శరీరంలో రక్త పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒత్తిడి పెరిగి నరాలపై భారం పెరుగుతుంది. కాబట్టి, ప్రెగ్నెంట్ లేడీస్‌కు కూడా ముప్పు ఉన్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం అలవాటు ఉన్నవారిలో రక్త ప్రవాహం, నరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి, వారు కూడా రిస్క్‌లో ఉన్నట్టేనని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా సేపు కూర్చునే వ్యక్తుల కాళ్లలో రక్తం సరిగా ప్రవహించదు. కండరాలకు రక్తం పంపిణీ చేయడంలో నరాలు మందగిస్తాయి. ఇక, కుటుంబ సభ్యుల చరిత్రను కూడా సీవీఐ వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వంశపారంపర్యంగా సీవీఐ లేదా సంబంధిత సమస్యలు ఉంటే ముప్పు పెరుగుతుంది. ఇక, ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది. సాధారణంగా కంప్రెషన్ థెరపీ, జీవనశైలిలో మార్పులు, మందుల వాడకం రూపంలో చికిత్స ఉంటుంది. తద్వారా రక్త ప్రవాహం మెరుగుపడి కాళ్లలో వాపును తగ్గిస్తాయి.
Read Also- Viral Video: ఈ వీడియో చూస్తే దాబాకు వెళ్లాలంటే జంకుతారేమో!