Swetcha Special story: ప్రస్తుతం ఎక్కడ చూసిన నకిలీలే రాజ్యమేలుతున్నాయి. అతి తక్కువ ధరలకు రావడంతో పాటు నిర్వాహకులకు, వ్యాపారులకు ఆదాయ మార్గంగా కనిపిస్తోంది. ఇంట్లో నిత్యవసరాల కోసం వాడుకునే ఉప్పు, పప్పుల నుంచి ప్రతి ఒక్కటి కల్తీగానే వ్యాపారం మార్కెట్లలో లభిస్తున్నాయి. నాణ్యమైన నిత్యవసర వస్తువులు దొరకడమే గగనంగా మారిపోయింది. మనుషుల మనసులోనే స్వార్థపు కల్తీ ఉండడం. అది కూడా వ్యాపారానికి ఉపయోగించడం పరిపాటిగా మారుతోంది. రైతులు విత్తనాలు వేసే దగ్గర నుండి ఎరువులు, రసాయనిక ఎరువుల వరకు మొత్తం కల్తీగా మార్కెట్లలో లభిస్తున్నాయి. తినే ఆహార పదార్థాల్లోనూ తీవ్ర కల్తీలు(Adulterations) జరగడంతో తరచుగా అవి తిన్న వారికి అనారోగ్య కారకాలుగా మారుతున్నాయి. ఇలా అశ్వారావుపేటలో జరుగుతున్న కల్తీ ఆహార పదార్థాలపై స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం.
నకిలీ చికెన్.. నాసిరకం నూనెతో వంటలు
కోళ్ల ఫారంలలో చిన్న కోడి పిల్లల వయసు నుంచి చికెన్ గా వాడుకునేంతవరకు ఆ చిన్న పిల్లలకు విషపు టాబ్లెట్స్(Tablets), ఇంజక్షన్లను ఇచ్చి నెల నుండి 45 రోజుల్లోనే కేజిన్నర నుంచి రెండున్నర కేజీల వరకు ఉండే బరువు ఉండే కోళ్లను మార్కెట్లలో చికెన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. ఇలా చికెన్ సెంటర్ల ద్వారా నకిలీ చికెన్ తీసుకొచ్చి నాసిరకం వంట నూనెలలో ఆహారాలను తయారు చేసి విక్రయాలు జరుగుతున్నారు. అశ్వరావుపేట మండల కేంద్రంలో ఆహార వ్యాపారం రోజు రోజుకు భయానకంగా మారుతుంది. అడపదడపా ప్రయాణాలు చేసే వారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇలాంటి ఆహారాలను తిని తీవ్ర అనారోగ్య భారీన పడుతున్నారు. బహిరంగంగా ఫ్లైట్ రైస్ సెంటర్లు, బిరియాని హోటల్లు పుట్టగొడుగుల్లా పెరుగుకుంటూ వస్తున్నాయి. నాణ్యత పై ఎటువంటి పర్యవేక్షణ తనిఖీలు జరగకపోవడంతో నకిలీ ఆహారాల విక్రయాలు రాజ్యమేలుతున్నాయి.
మైదా పిండితో చికెన్
చికెన్ కర్రీ, చికెన్(Chiken) ఫ్రై పేరుతో వడ్డిస్తున్న వంటకాలలో కొన్నింటి అసలు రూపం మైదాపిండి. ఈ మైదాపిండి మాంసం ముక్కలు అరిగిన కూడా అరగదు. దీంతో ఈ మైదాపిండితో తయారుచేసిన ఆహార పదార్థాలను తిన్నవారికి జీర్ణ కోశ సమస్యలు అధికంగా ఉత్పన్నమవుతున్నాయి. మైదా పిండితో మాంసం ముక్కల లాగా కట్ చేసి వాటికి మసాలా, రంగు వేసి మంటల్లో వేయించి కస్టమర్లకు చికెన్ పేరుతో వడ్డిస్తున్నారు. దీని వినియోగం వల్ల జీర్ణ క్రియ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
Also Read: Tribal Committee: చట్టాలు అమలు చేయకపోతే స్వయం పాలన ప్రకటిస్తాం
ఫ్రైడ్ రైస్ వెనుక ముప్పు
పలు పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో ఫ్రైడ్ రైస్ పేరిట తాత్కాలిక వ్యాపార సెంటర్లలో గుమగుమలాడే ఫ్రైడ్ రైస్ వెనుక వాడుతున్న నూనెలు చాలాసార్లు మళ్లీమళ్లీ అవయవారుతున్నారు. దీంతో మంటల్లో అధికంగా వేడి అయిన నూనెతో వంటకాలు తయారు చేయడం పరిపాటిగా మారుతుంది. దీనికి తోడు అతి తక్కువ చౌకదారులకు లభించే నకిలీ నూనెలను కూడా వాడుతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఇవి లివర్, హృద్రోగ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజల రద్దీని వాడుకునే వ్యాపారు
అశ్వరావుపేట(Aswaraopet) పట్టణంలో ప్రతి బుధవారం సొంత రోజు కావడం. చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలనుండి వందలాది గిరిజనులు, బడుగులు బలహీన వర్గాల ప్రజలు అక్కడికి వస్తుంటారు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా వచ్చే రద్దీ ప్రజలను వాడుకునే వ్యాపారులు తమ ఆదాయ మార్గాలతో అక్రమమార్జనలకు పాల్పడుతున్నారు. ప్రజారోగ్యం వారికి ఏమాత్రం పట్టదు. రోజువారీగా పెట్టుబడి డబ్బులు పోను అంతకంత మరింత ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేస్తూ కల్తీ నిత్యవసర వస్తువులతో ప్రజలకు ఆహార పదార్థాలను తయారుచేసి విక్రయాలు చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆహార పదార్థాలు అందించే హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్(Fast Food) సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ గైర్హాజరి కారణంగా ప్రజల అనారోగ్యాలకు మూలంగా కనిపిస్తోంది. ఆహార భద్రత అధికారులు, మున్సిపల్ తనిఖీ బృందాలు క్రమం తప్పకుండా పరిశీలనలు చేయకపోవడం వల్ల నకిలీ ఆహార వ్యాపారం తీవ్రంగా పెరుగుతుంది. లైసెన్స్ లేకుండా హోట(Hotels)ళ్ళు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా రకరకాల కల్తీ ఆహార పదార్థాలతో ఆహార విష బాధ ఘటనలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు ఉత్పన్నమయ్య అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తక్కువ ఆదాయ వర్గాలపై ఆర్థిక భారం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావడంతో వైద్య ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ తనిఖీల అధికారులు వివిధ రకాల శాఖల అధికారులతో సంయుక్తంగా క్రమం తప్పని తనిఖీలు చేపట్టి లోపాలున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ ఆహార గుర్తింపు పై ప్రజల్లో నిత్యం అవగాహన కల్పించాలి. లైసెన్సింగ్ విధానం కఠిన తరం చేసి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎక్స్పోజ్ చేయాలి.
Also Read: Gadwal Atrocity: గద్వాల జిల్లాలో దారుణం.. ఆస్తి కాజేసి తల్లికి రోగముందని ప్రచారం!