Land Encroachments: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్(Hyderabad) నగరం అతలాకుతం అవుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రదాణ కారణం వర్షపు నీరు బయటికి పోకుండా రోడ్లపై నిలువడమేనని ప్రజలు చెప్తున్నారు. వరద నుండి నగరాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మల్లి అదే పరిస్థితి దాపురిస్తుంది. దీనికి ప్రధాన కారణం కొందరు అక్రమార్కులు చెరువులు, నాలాలు కబ్జా చేసి ఇష్ట రీతిలో నిర్మాణాలు చేపట్టడం వల్లే హైదరాబాద్ నగరానికి ఈ దుస్థితి దాపురించిందని సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలు కబ్జా కాకుండా హైడ్రా(Hydraa) లాంటి స్పెషల్ టీం ఏర్పాటు చేసిన చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. తమకి వీటితో పట్టనట్టుగా అక్రమార్కులు తమ పని తము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఉండడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు.ఈ అక్రమార్కుల వల్ల రానున్న రోజులు మేడ్చల్ పెద్ద చెరువుతో ప్రజల ముప్పు పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు.
పర్యాటక కేంద్రంగా మేడ్చల్ పెద్ద చెరువు
మేడ్చల్(Medchal) చెరువు వర్షాకాలంలో అలుగు పారుతున్నప్పుడు చెరువు వద్ద ప్రజలతో ఒక పర్యాటక ప్రాంతంగా సందడిగా మారుతుంది. అంతేకాకుండా మేడ్చల్ పట్టణ ప్రజలు బతుకమ్మతో పాటు గణేష్ నవరాత్రులు అదే చెరువులో నిమజ్జనం చేస్తారు. అంతేకాకుండా అలాంటి మత్స్య కారులు సైతం మేడ్చల్ చెరువులో చేపలు పెంచుతూ వారి జీవనోపాది కొనసాగిస్తారు. ఎంతో మందికి ఆసరాగా ఉంటున్న మేడ్చల్ పెద్ద చెరువును కొందరు అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతూ చెరువును కనుమరుగు అయ్యేలా చేస్తున్నారు.
పెద్ద చెరువు కబ్జాతో ప్రజలకు ముప్పు
మేడ్చల్ పెద్ద చెరువు కొందరు అక్రమార్కులు అలుగు వద్ద ఉన్న స్థలాన్ని నీరు బయటికి పోకుండా మట్టితో పూడుస్తూ కబ్జాకు యత్నిస్తున్నారు. అలుగు వద్ద మట్టి పోసి స్థలాన్ని కబ్జా చేయడం వల్ల చెరువు నిండినపుడు అలుగు పోయే నీరు పోక పోవడంతో పట్టణ ప్రజలు ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉంది. చెరువు అలుగు కబ్జాతో చెరువు కింద ఉన్న పలు కాలనీలతో పాటు పంట పొలాలు, పారిశ్రామిక కంపెనీలు ముప్పునకు గురయ్యే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం పెద్ద ఎత్తున పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 3000 Year Old Skeletons: 3000 ఏళ్ల క్రితం జరిగిన బలిదానాలు.. బయటపడ్డ 14 అస్థిపంజరాలు.. ఎక్కడంటే?
కబ్జా.. పట్టించుకోని అధికారులు
మేడ్చల్ పెద్ద చెరువు కబ్జాకు గురవుతున్నా రెవిన్యూ(Revenue), ఇరిగేషన్(Irrigation) అధికారులకు కనబడటం లేదా అని మేడ్చల్ పట్టణ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చోని ఉంటున్న గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలు మాత్రం అధికారులకు కనబడటం లేదు. వార్డు స్థాయి నుండి, గ్రామ స్థాయి వరకు సందర్శించాల్సిన అధికారులు గ్రామాల్లో, వార్డుల్లో పర్యటిస్తున్నారా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ తహశీల్దార్ కార్యాలయానికి కొద్ది దూరంలోనే ఉన్నా పెద్ద చెరువుకే రక్షణ లేకపోయే ఇక మారుమూల గ్రామాల్లో ఉన్న చెరువుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ చెరువు కబ్జాపై స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కథనం ప్రచురితమైనా అధికారులు మాత్రం వచ్చి నామమాత్రంగా సందర్శించి వెల్లిపోయారు గాని చర్యలు మాత్రం తీసుకోలేదు.
కథనాలు ప్రచురితమైన పట్టించుకోని అధికారులు
కబ్జాకు గురవుతున్నా మేడ్చల్ చెరువు అనే కథనాలు ప్రచురితమైనా అధికారులు పట్టించుకోవడం లేదు. మేడ్చల్ పెద్ద చెరువు కబ్జా విషయమై స్వేచ్చ దినపత్రికలో ప్రచురితమవడంతో అధికారులు వచ్చి సందర్శించారు. అధికారుల సందర్శన సమయంలో అక్రమార్కులు జేసీబీలతో చెరువును పూడిక చేస్తుంటే చూసి చూడనట్లు వచ్చి ఏదో వచ్చాం సందర్శించాం అన్నట్లు చేశారు. పైగా అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని నీతి వాఖ్యలు పలికారు. కళ్లముందే చదును చేస్తున్న జేసీబీలను తరలించివేసి అధికారులు సందర్శించినట్లు సినిమా సీన్ క్రియేట్ చేస్తున్నారు. మరుసటి రోజు నుండి కబ్జా చేస్తారు.
Also Read: SC on Delhi-NCR: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!