Ganja Seized: ఒరిస్సా నుంచి హైదరాబాద్(Hyderabad)కు కారులో తరలిస్తున్న రూ. 22 లక్షల విలువైన 43 కేజీల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్టు చేశారు. ఒరిస్సా రాష్ట్ర నుంచి హైదరాబాద్(Hyderabad)కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని రూ 22 లక్షల విలువగల తరలిస్తుండగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీమ్ పట్టుకున్నారు. హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఒక అద్దెకారును కిరాయికి తీసుకొని కారులో ఒరిస్సా ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి కారులో 43 కిలోల గంజాయిని తీసుక వస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుబడ్డాడు.
Also Read: Save Singareni: తెలంగాణ బొగ్గుగని ఉద్యమ బాట.. 11 డివిజన్లలో నిరసనలు ధర్నాలు
గంజాయి అమ్మకాలు
సురేందర్ సింగ్ రాజ్‌కోట్, రాజస్థాని స్వంత స్వగ్రామం కాని చాల కాలంగా హైదరాబాద్(Hyderabad)లో సురేందర్ గత కొంత కాలంగా నివాసం ఉంటూ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడని విచారణలో వెల్లడయ్యింది. భధ్రాచలం ఇసుక స్టాండ్ సమీపంలో ఎన్‌ఫొర్స్‌మెంట్ ఖమ్మం జిల్లా(Khammam District) అధికారుల తో కలిసి పక్కా సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణకు చెందిన కారులో గంజాయిని స్వాధీనం చేసుకొని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
Also Read: Jagityal district: కలెక్టర్ ముందు మరోసారి వికలాంగుడు నిరసన.. న్యాయం జరిగేనా!