Komatireddy Venkat Reddy ( IMAGE credit: swetcha reporter)
Politics

Komatireddy Venkat Reddy: ఆయన అవినీతికి అడ్డూ అదుపు లేదు.. మాజీ మంత్రికి 80 ఎకరాల ఫామ్ హౌస్

Komatireddy Venkat Reddy: మూడు లక్షల జీతమున్న అధికారి ఏకంగా థాయ్‌లాండ్‌లో పెళ్లి చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy0 పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్లు, ఇతర అధికారుల వద్దే వేల కోట్లు ఉంటే, లీడర్ల దగ్గర ఇంకా ఏమేరకు ఉన్నదో? అలోచించవచ్చని మంత్రి వివరించారు. సచివాలయంలో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో మంత్రుల నుంచి కొందరు ఆఫీసర్ల వరకు అంతా కలిసి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.

ఒక్కొక్కరి లెక్కలు ఆధారాలతో సహా బయటకు తీస్తున్నామన్నారు. ‘మా జిల్లా మాజీ మంత్రికి షాబాద్‌లో ఏకంగా 80 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. బీఆర్ఎస్(BRS) నేతల బినామీలు ఫోన్లు ఎత్తడం లేదు. వాళ్లకు వాళ్లే కొట్టుకుంటున్నారు. నేను ఏడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచాను. నా అఫిడవిట్‌లో ఎలాంటి తప్పిదాలు లేవు. ఇక ఏపీ రాజకీయం, తెలంగాణ పాలిటిక్స్‌కు సంబంధం లేదు. ఏపీని చూసి తెలంగాణలోనూ అరెస్టులు ఉంటాయని భావించొద్దు’ అని కోమటిరెడ్డి తెలిపారు.

Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

ఫిలిం హబ్‌గా అభివృద్ధి..
హైదరాబాద్‌(Hyderabad)ను గ్లోబల్ ఫిలిం హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. సినిమా, వినోద రంగంలో హైదరాబాద్(Hyderabad) బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండటంతో అవి ఉత్తమ సినిమా షూటింగ్ లొకేషన్లుగా ఉపయోగించవచ్చని చెప్పారు. ఇది స్థానిక ప్రజలకు ఆదాయాన్ని కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుందన్నారు. సినిమా కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉన్నదన్నారు. అదే సమయంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. అయితే సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని స్పష్టం చేశారు.

ఎంపీల అరెస్ట్ అక్రమం
ఓట్ల చోరీపై ఆధారాలతో సహా నిరూపించి దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎంపీలు ప్రియాంక గాంధీ ఇండియా కూటమి ఎంపీలను మోదీ సర్కారు ఢిల్లీలో అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల చోరీపై వినతి పత్రం ఇస్తామని శాంతి యుతంగా వెళ్తున్న ఎంపీలను అరెస్ట్ చేయడం అక్రమమని, అప్రజాస్వామ్యమని అన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేసి ఓట్ చోరీపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సింగరేణి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషం ఉందని మంత్రి అన్నారు. స్కిల్స్ లేక చాలా మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారని, అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

 Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!