BRS on Congress: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్( kcr) నేతలకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంకా రాద్దాంతం చేస్తున్నారని, మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్స్‌కు మరమ్మతులు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని దీనిపై కాంగ్రెస్(Congress) అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని, విస్తృతంగా ప్రజలకు వివరించాలని సూచించారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో సోమవారం మాజీ మంత్రులు కేటీఆర్,(KTR) హరీశ్ రావు,(Harish Rao) మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలు, బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, బనకచర్ల ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించి, నేతలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై కూలంకుషంగా చర్చించారు.
Also Read: 12 Year-Old Girl Assaulted: దేశంలో అత్యంత ఘోరం.. 12 ఏళ్ల బాలికపై.. 200 మంది అత్యాచారం!
చట్టాలను సైతం అధ్యయనం చేయాలి
ఈ సందర్భంగా కేసీఆర్(KCR) మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో స్పీకర్‌పై ఒత్తిడిపెంచేలా కార్యచరణ చేపట్టాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా మాట్లాడాలని, అందుకు చట్టాలను సైతం అధ్యయనం చేయాలని, సమావేశంలో ప్రస్తావించాలని అన్నారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. కాళేశ్వరం, బనకచర్ల అంశంపై గళం విప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ప్రాజెక్టులపై అవగాహన లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత తెలియదని మరోసారి వివరించాలని నేతలకు సూచించారు. కాళేశ్వరంపై సైతం న్యాయపోరాటం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అదే విధంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించినట్లు సమాచారం.
ఎప్పటికీ విలీనం కాదు..
ఈ మధ్యకాలంలో బీజేపీలో బీఆర్ఎస్(BRS) విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్(Kcr) సూచించారు. పార్టీ ఎప్పటికీ విలీనం కాదని, తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్(BRS) ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీని ఎదుర్కోలేకనే వీక్ చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని పార్టీ ఘనతను ప్రజలకు వివరించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్(Brs) ఏ పార్టీలో విలీనం కాదని క్లారిటీ ఇచ్చినప్పటికీ పదేపదే దుష్ప్రాచారం చేస్తున్నారని దీనిని ఎండగట్టాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాలని, అర్హత పడేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 14న కరీంనగర్ లో జరిగే బీసీ బహిరంగసభకు ఏర్పాట్లు, జనం తరలింపు, కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై అనుసరిస్తున్న విధానం, ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం.
సభ బాధ్యతలు విజయవంతంపై తీసుకోవాల్సిన చర్యలను మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు వివరించారు. బీఆర్ఎస్ మొదట్నుంచీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందని, రెండుపర్యాయలు బీసీలకు ఇచ్చిన నామినేటెడ్, మంత్రి పదవులు, తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న జాప్యంపై అవసరం అయితే ప్రభుత్వంపై ఒత్తిడిపెంచేందుకు పోరాట బాట పట్టాలని సూచించారు. ప్రభుత్వ హామీలు వైఫల్యాలు, సంక్షేమ పథకాల అమలులో జాప్యంపై ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ