Bc Reservation eservation Bill: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(v) స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నేతలతో భేటీ అయ్యారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కంటితుడుపు చర్య మాత్రమే అన్నారు.
Also Read: Plane Crash: ఓరి దేవుడా.. విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం.. క్షణాల్లో పెను విధ్వంసం!
కేంద్ర ప్రభుత్వం జాప్యం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, చట్టసభలు ఆమోదించిన బిల్లులతో పాటు క్యాబినెట్ చేసిన చట్టసవరణకు ఆర్డినెన్స్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత బీసీలను వంచించాలనే చూస్తోన్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజల ముందు ఎండగడుతామని స్పష్టం చేశారు. కలిసొచ్చే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని కవిత వెల్లడించారు.
Also Read: Gurukulam: సవాళ్ల నడుమ నడుస్తున్న గురుకులాలు.. సమస్యలు సృష్టిస్తున్న పాత కాంట్రాక్టర్లు