Protest At Konda Surekha Home (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Protest At Konda Surekha Home: మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఆందోళన?

Protest At Konda Surekha Home: హనుమకొండ రాంనగర్ లోని మంత్రి కొండ సురేఖ(Min Konda Sureka) ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిఐటియు(CITU) ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన నిర్వహకులు మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేయగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు అడ్డుకొని కారుకు అడ్డంగా బయటనుంచి ఆందోళన నిర్వహించారు.

1995 సంవత్సరం నుండి

మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వాలనే ప్రయత్నం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరవించేది లేదని బైఠాయించారు. దీంతో నివాసం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు మాట్లాడుతూ 1995 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వండి పెడుతుండగా.. ఇప్పుడు మధ్యాహ్నం భోజన పథకం కార్మికులకు బియ్యం ఇవ్వకూడదని ఆ పథకాన్ని అక్షయపాత్రకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయడం సిగ్గుమాలిన చర్య అని సిఐటియు నాయకులు మండిపడ్డారు.

Also Read: Actor Rajinikanth: బాలుడి నిజాయితీకి ఫిదా అయిన రజనీ.. ఏం చేశారంటే..

కనీస వేతనం 26 వేల రూపాయలు

ఎన్నో ఏళ్లుగా చాలి చాలని వేతనంతో సకాలంలో ప్రభుత్వం బిల్లులు ఇవ్వకున్నా.. అప్పులు చేసి మరి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించిన తమను రోడ్డున పడి వేసే విధంగా ఇతరులకు పథకాన్ని అప్పగించాలానే ఆలోచన మానుకోవాలని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. గత పది సంవత్సరాల నుండి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని ఆందోళన పోరాటాలు చేసిన ప్రభుత్వాలు తమను విస్మరించడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షయపాత్ర కు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also Read: CM Revanth Reddy: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే