Actor Rajinikanth: తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన 7 సంవత్సరాల బాలుడు యాసిన్, తన నిజాయితీతో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎంతగానో కదిలించాడు. యాసిన్ తన స్కూల్‌కు వెళ్తుతున్న సమయంలో దారిలో ఒక బ్యాగ్ దొరికింది. దానిని తెరిచి చూడగా కరెన్నీ నోట్లు కనిపించాయి. దానిని వెంటనే తీసుకువెళ్లి తన టీచర్కు అప్పగించాడు. అనంతరం ఆ టీచర్ బ్యాగును పోలీసులకు అప్పగించారు. జరిగింది అంతా పోలీసులకు చెప్పగా వారు ఆ బాలుడిని అభినందించారు. ఎందుకు ఈ బ్యాగ్ తిరిగి ఇచ్చావు అని పోలీసులు యాసిన్ ను అడగ్గా.. ‘నేను శ్రమ పడకుండా వచ్చింది ఏదీ నాకు వద్దు. అది నాకు పాపపు సొమ్ముతో సమానం.’ అని చెప్పాడు. దానిని విన్న పోలీసులు ఆ బాలుడి నిజాయితీకి సలాం చేశారు. పోలీసులు.. మా తరఫునుంచి ఏమైనా కావాలా అని అడగ్గా.. రజనీ కాంత్ ని కలవాలి అని కోరాడు. పోలీసులు ఆ బాలుడిని రజనీ దగ్గరకి తీసుకు వెళ్లారు. జరిగింది అంతా విన్న రజనీ ఆ బాలుడి నిజాయితీకి ఫిదా అయిపోయారు. అప్పటికప్పుడు ఓ బంగారు గొలుసు ఆ బాలుడికి గిఫ్టుగా ఇచ్చారు. తన చదువుకు కావాల్సిన మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏళ్లు గడుస్తుంది. తాజాగా రజనీ మరో సారి ఈ ఆర్టికల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read also- Ravichandran Ashwin: టీమ్ నుంచి నన్ను రిలీజ్ చేయండి.. సీఎస్కే స్టార్ ప్లేయర్ విజ్ఞప్తి
యాసిన్‌ను కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసంలోని పోయస్ గార్డెన్‌కు ఆహ్వానించిన రజనీకాంత్, “ఈ రోజుల్లో చిన్న మొత్తం కోసం కూడా మోసం చేసే, దొంగతనం చేసే లేదా హత్యలు చేసే వారి మధ్య, యాసిన్ ఈ డబ్బు తనది కాదని చెప్పి అప్పగించాడు. ఇది నిజంగా గొప్ప నిజాయితీ” అని మీడియాతో అన్నారు. అతను యాసిన్‌ను తన కొడుకులా భావిస్తూ, అతని భవిష్యత్ చదువులకు స్పాన్సర్ చేస్తానని వాగ్దానం చేశారు. రజనీ మంచి మనసుకు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి నిజాయితీ పరులు సమాజానికి ఎంతో అవసరమని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Read also- India on Pak Ban: పాక్‌లో హిందువుల ఊచకోత.. పార్లమెంటు వేదికగా కేంద్రం కీలక ప్రకటన!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కూలీ’. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రం రజనీకాంత్ కి 171వ చిత్రం. ఆయన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ఆగస్టు 14, 2025న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ప్రచార చిత్రాలు చూస్తుంటే లోకేశ్ కనగరాజ్ మరో ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్. ఓవర్సల్ లో అమ్ముడయిన టికెట్లు చూస్తుంటే ఈ సారి బాక్సాఫీసు దగ్గర 1000 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది.