CMRF Fund Scam: కష్టాల్లో ఉన్నవారికి బాసటగా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్(CMRF )నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటుంది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్(CMRF )నిధులు పక్కదారి పట్టాయి. ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. ఓ వ్యక్తి తనకు రావాల్సిన డబ్బుల గురించి ఆరా తీయగా తన పేరుతో ఉన్న మరో వ్యక్తి అకౌంట్‌లో డబ్బులు జమ కావడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా భారీ స్కామ్ వెలుగుచూసింది.
Also Read: GHMC Commissioner: సహాయక చర్యల్లో వేగం పెంచండి: కమిషనర్ కర్ణన్
అసలేం జరిగిందంటే?
నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు (Gaddam Venkateswara Rao) అనే వ్యక్తి 2022లో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో సీఎంఆర్ఎఫ్ (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే 2023లోనే ఇతనికి లక్షన్నర మంజూరైంది. కానీ, చెక్కు మాత్రం అందలేదు. అతని అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు (Gaddam Venkateswara Rao) అనే వ్యక్తి ఖాతాలోకి నగు బదిలీ చేసింది ముఠా. ఏళ్లు గడుస్తున్నా తనకు డబ్బులు అందకపోవడంతో బాధితుడు సంబంధిత అధికారులను వాకబు చేయగా అసలు నిజాలు వెలుగుచూశాయి.
కీలక నేత పాత్ర ఉందా?
సీఎంఆర్ఎఫ్(CMRF) కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత చెక్కులు స్థానిక ప్రజాప్రతినిధి దగ్గరకు వచ్చేవని సమాచారం. అనుచరులు పంపిణీ చేసేందుకు తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా, పేరు, ఇంటి పేరుకు దగ్గరగా ఉన్న వారి అకౌంట్లకు నగదు బదిలీ చేసినట్టు తెలుస్తున్నది. అయితే, సదరు లీడర్‌గా తెలియకుండా ఇదంతా జరగదనే ప్రచారం జరుగుతున్నది. గతంలో సెక్రటేరియట్‌లో పని చేసిన కీలక ఉద్యోగి దీనికి సహకారం అందించినట్టు సమాచారం. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
Also Read: Solar Power Plant: జీపీ నుంచి సెక్రటేరియట్.. భూముల వివరాలు పంపండి