Mahesh Kumar Goud: దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో బీసీ నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కాలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) పేర్కొన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులను తప్పక చూస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sardar Sarvai Papanna Goud Jayanthi) మహారాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakr), కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్(Srikanth Goud), టీపీసీసీ జనరల్ సెక్రటరీలు వట్టికూటి రామారావు గౌడ్, మధు సత్యం గౌడ్, వివిధ పార్టీల గౌడ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సోషల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేస్తున్న పోరాటం ఎనలేనిదన్నారు. ఎవరి శాతం వారికి వాటా అన్న రాహుల్ గాంధీ ఆశయం మేరకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ(BC) సీఎం(CM) అవుతారని స్పష్టం చేశారు.
Also Read: Bhatti Vikramarka: బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న భట్టి
తికమకపెట్టే విధంగా వ్యాఖ్యలు
ఇటీవల జంతర్ మంతర్‌లో చేపట్టిన మహా ధర్నాకు అన్ని వర్గాల నేతలు, ప్రజలు విశేష మద్దతు తెలిపారని అన్నారు. బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ(BJP) నేతలు ఢిల్లీలో మాత్రం మొఖం చాటేశారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తికమకపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని హామీ ఇచ్చారు.ఇక కూకట్పల్లి(Kukatpally) ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. నగరంలో కల్లు కాంపౌండ్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్లు కాంపౌండ్‌లకు సంబంధించి తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు.
Also Read: GHMC Commissioner: సహాయక చర్యల్లో వేగం పెంచండి: కమిషనర్ కర్ణన్
