CM Revanth Reddy: చిన్నారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏడవ తరగతి చదువుతున్న జశ్వంత్(Jaswant) తో మాట్లాడారు. వరద నీటి సమస్య గురించి సీఎం ప్రశ్నలు అడగగా సమస్య తీవ్రతను సీఎంకు చిన్నారి తెలిపింది. వరద పరిస్థితిని సీఎంకు బాలుడు వివరించాడు. అమీర్పేట్(Ameerpet) బుద్ధ నగర్‌లో ఓ బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై సీఏం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ బాలుడు జశ్వంత్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీరు వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని సీఎంకు బాలుడు జశ్వంత్ చెప్పాడు. భవిష్యత్లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్(Hyderabad) అమీర్పేట్ బుద్ధ నగర్ బస్తీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తమ బస్తికి ముఖ్యమంత్రి రావడం పట్ల బాలుడు జస్వంత్ ఆనందం వయక్తం చేశాడు. 7th క్లాస్ చదువుతున్న జస్వంత్ సీఎం రేవంత్ రెడ్డి జస్వంత్ తో కలిసి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. తమ బస్తీలో సమస్యలను అడిగి తెలుసుకున్నాడని వాటిని పరిష్కరిస్తామనీ సీఎం హామీ ఇచ్చినట్లు జస్వంత్ చెబుతున్నాడు. మరేదైనా సమస్య ఉంటే తనకు పిర్యాదు చేయాలని సీఎం చెప్పాడని తెలిపాడు.
Also Read: Raja Singh: ఇంత బిల్డప్ అవసరమా? రాజా సింగ్ సంచలన కామెంట్స్!
గంగూబాయి బస్తీ కుంట
వరద ప్రభావిత ప్రాంతాలైన, అమీర్ పేట్(Ameerpet), బుద్ధ నగర్, మైత్రి వనం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యట చేశారు. బుద్ధనగర్‌లో డ్రైన్ సిస్టంను సీఎం పరిశీలించి అనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందన్న సీఎం అన్నారు. వెంటనే డ్రైనేజీ సిస్టంను స్ట్రీమ్ లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ(Gangubai Basti) కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్ కు వినియోగిస్తున్నారని అక్కడి స్ధానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు. అనంతరం గంగూబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించి సీఏం అధికారులకు పలు సూచనలు చేశారు. ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
50 ఇండ్ల మా సమస్య తీరబోతుంది
సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మా కాలనీకి రావడం ఆనందంగా ఉందని, మా సమస్యలు అడగడం వాటిని పరిష్కరిస్తామని వెంటనే అధికారులకు ఆదేశించారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యట చేశారు. హైదరాబాద్ అమీర్పేట్ లోని శ్రీనివాస కాలనీలో సీఏం పర్యటించారు. మా కాలనీలో వరదకు ప్రధాన కారణం ఏంటని సీఎం(CM) అడిగి తెలుసుకున్నారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్(Ameerpet Metro Station), మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న భారీ నాలా ఉంది. అక్కడ నాలా నుండి వరద నీటిని తరలించాలి. ఆ నాలా నుండి బయటికి వాటర్ వెళ్లకపోవడం వల్లనే భారీగా వరద వస్తుందని, మా సమస్యను పరిష్కరించమని సీఎంను కోరామని స్థానికులు తెలిపారు. సీఏం వెంటనే అధికారులకు ఆదేశించి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో మా సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.
Also Read: 500 Women Tied Rakhi: సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కు రాఖీలు కట్టిన 500 మంది మహిళలు