BRS on BC Candidate (Image Source: Twitter)
తెలంగాణ

BRS on BC Candidate: బీసీలపై గురిపెట్టిన బీఆర్ఎస్.. ఆర్మూర్ నుంచే స్టార్ట్.. వారి సీట్లు గల్లంతే!

BRS on BC Candidate: ఇప్పుడు రాష్ట్రమంతా బీసీ నినాదం వినిపిస్తున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజవర్గంలోనే మొదటి బీసీ బాంబ్ పేలనుందా అంటే పొలిటికల్‌గా నిజమేననే ప్రచారం జరుగుతున్నది. ఆర్మూర్ అంటేనే వెరీ హాట్ గురు అంటారు అక్కడి ఓటర్లు. రాజకీయంగా విభిన్న తీర్పు ఇవ్వడంలో ఆ నియోజకవర్గానికి పెట్టింది పేరు. జిల్లా పాలిటిక్స్‌కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఈ నియోజకవర్గం నిలుస్తుంది. అక్కడ ఫైర్ బ్రాండ్ లీడర్లకు కోదవ ఉండదు. ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. అతి తక్కువ కాలంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు.

జీవన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు!
గత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి ఎన్నో అవినీతి ఆరోపణలు, వివాదాలు ముసురుతుండడంతో మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. దీంతో పార్టీ అధినేత ప్రత్యామ్నయ నాయకత్వంకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అందుకు నందిపేట్ వాస్తవ్యుడు చార్టెడ్ అకౌంటెంట్‌గా చారిటబుల్ ట్రస్ట్‌లు నడుపుతున్న బీసీ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఈరవత్రి రాజశేఖర్ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నారట. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఆర్మూర్ నియోజకవర్గం అంటేనే పద్మశాలి సామాజిక వర్గానికి పెద్దగా ఉన్న ఓటు బ్యాంకు. ఇక, మరో సామాజిక వర్గం అయినా మునూరు కాపు వర్గానికి చెందిన బీ‌ఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్‌తో వెన్నుదన్నుగా ఉన్న మాజీ దివంగత నేత ఆలూరు గంగారెడ్డి కూతురు గత నెలలో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఫాంహౌస్‌లో కలవడం ఆర్మూర్ రాజకీయ ముఖచిత్రంలో మార్పులపై జోరుగా చర్చ జరుగుతుంది.

కేసీఆర్‌కు ఈ సెగ్మెంట్ చాలా సెంటిమెంట్
ఆర్మూర్ అంటే కేసీఆర్‌కు సెంటిమెంట్ 2014లో అసెంబ్లీ ఎన్నికల మొదలు ఇక్కడి నుంచి ఫస్ట్ టికెట్ ప్రకటన చేస్తారు. పదేళ్లుగా ఆర్మూర్‌లో కారు పార్టీ బలంగా ఉండేది ప్రస్తుతం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రానున్న ఎన్నికల వరకు పార్టీ ఉంచుకోవాలని ఉద్దేశంతో గులాబీ బాస్ ఉన్నారట. ఇప్పటికే కేసీఆర్‌తో ఆర్మూర్ నియోజకవర్గంలో పేరుగాంచిన చార్టెడ్ అకౌంటెంట్ అయినా ఈరవత్రి రాజశేఖర్ టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం. ఈ సారి మహిళా నేతను బరిలో దింపేందుకు అధినేత భావిస్తున్నారని మరో ప్రచారం అంటూ బీఆర్‌ఎస్‌లో కొత్త చర్చకు దారి తీసింది. ఆర్మూర్ నియోజవర్గంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడంతో మాజీ ఎమ్మెల్యేపై వివాదాలు ఉండడంతో అసలు వివాదాలు లేని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారి కోసం కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్లు సమాచారం. అయితే, ఇందులో భాగంగానే చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్, ఆలూరు గంగారెడ్డి కూతురు విజయ భారతి రెడ్డి కేటీఆర్ ద్వారా కేసీఆర్‌తో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Also Read: Kantara – Chandramukhi: నిద్రలేచిన చంద్రముఖి.. కాంతార టీమ్‌ను వెంటాడుతున్న మృత్యువు.. రెండింటికి లింకేంటి?

ట్రస్టు ద్వారా సామాజిక సేవలు
ఇక, రాజశేఖర్ తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న వస్తుండగా, విజయభారత్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్‌గా పనిచేసి తండ్రి రాజకీయ వారసురాలిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఇక ఆర్మూర్ నియోజవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో వస్తే, బీజేపీ మొదటి స్థానంలో వచ్చి ఆయన అభివృద్ధి సోషల్ మీడియాకి పరిమితం కాగా, బీ‌ఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వివాదాలకు కేరాఫ్‌గా నిలవడంతో కొత్త, యువతరం మహిళా నేతను బరిలో దింపాలని బీఆర్‌ఎస్ అధినేత ఆలోచన, ఆర్మూర్‌లో ఇప్పటికే నయా లీడర్ కోసం గులాబీ బాస్ అన్వేషిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి నిజమయితే ఎన్నికల్లో విభిన్న తీర్పు ఇచ్చే ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. వచ్చే ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ టికెట్ కోసం ఆశావాహులు బయట పడటం, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గులాబీ బాస్ సిరియస్‌గా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే ప్రచారం, కవిత ఓటమికి జీవన్ రెడ్డి కూడా ఒక కారణమనే ఆరోపణలతో ఈ సారి జీవన్‌రెడ్డి‌కి గట్టి దెబ్బపడేలా ఉందనేది పార్టీలో చర్చ జరుగుతున్నది.

Also Read This: SLBC Tunnel Works: వేగంగా పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?