Raja Singh: సీఎం, కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని, ముస్లింలు బీసీలా? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వాలని ధర్నా చేస్తున్నారని, ముస్లింలంటే మైనారిటీలని, మైనారిటీ రిజర్వేషన్ ఉన్నాక కూడా బీసీల్లో రిజర్వేషన్లు ఎందుకని ఆయన నిలదీశారు. కేంద్రం ఎలాగూ 27 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తోందని, కాంగ్రెస్ ఇచ్చేది కేవలం 5 శాతం కోసమేనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ షోపు టాప్ యుద్ధం ఎందుకని ఆయన నిలదీశారు.
స్టేట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్
బీసీల గురించి ఫైట్ చేస్తున్నందుకు కాంగ్రెస్ కు ధన్యవాదాలని ఎద్దేవాచేశారు. కానీ బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే బండి సంజయ్ స్టేట్ మెంట్ ఇచ్చారని, కాంగ్రెస్(Congress) కు నిజంగా బీసీలకే 42 శాతం ఇస్తామంటే తాము కూడా సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్(Congress) మొత్తం 42 శాతం బీసీలకే రిజర్వేషన్లు ఇస్తామని స్టేట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా అయితే వారితో పాటే తామే ధర్నా చేస్తామన్నారు. బీసీల గురించి ఫైట్ చేసేందుకు ఢిల్లీకి ఢిల్లీకి వెళ్లారా? ముస్లింల కోసం ఢిల్లీకిఢిల్లీకి వెళ్లారా? ? కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని ఆయన పట్టుపట్టారు. ఎందుకంటే ప్రజలు అయోమయంలో ఉన్నారని, సీఎం వెంటనే క్లారిటీ ఇవ్వాలన్నారు.
Also Read: Online Betting: అన్ లైన్ బెట్టింగ్‌తో అప్పులపాలు.. పోతున్న ప్రాణాలు