Mahesh Kumar Goud: గత రేవంత్ రెడ్డి వేరు..ఇప్పుడు వేరు
Mahesh Kumar Goud (Iimagecredit:twitter)
Political News

Mahesh Kumar Goud: గత రేవంత్ రెడ్డి వేరు..ఇప్పుడు వేరు: మహేష్​ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ బీసీ నాయకులు నోర్లు తెరవాలని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), ఎంపీ ఈటెల రాజేందర్(Eatala Rajendar), ఎంపీ అరవింద్(MP Aravindh) లు బీసీ బిల్లుకు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీసీ(BC) ప్రజలంటే లెక్కలేదా? అంటూ నిలదీశారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒప్పందం లో భాగంగానే బండి సంజయ్ ను అధ్యక్ష్య పదవి నుంచి తొలగించారన్నారు. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ను ఓక బీసీ నుంచి ,రాష్ట్ర అధ్యక్ష్య పదవి ని మరో బీసీ నుంచి కిషన్ రెడ్డి(Kishan Reddy) లాక్కున్నారన్నారు. ఇవన్నీ బీజేపీ బీసీ నేతలకు అర్ధం కావడం లేదా? అని వివరించారు.

గెలుపు నల్లేరు మీద నడకే
జూబ్లీహిల్స్(Jublihills) అభ్యర్థి ఎంపిక పై సర్వే జరుగుతుందని, నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్(KCR) బ్రేక్ చేశారన్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నిక(Local Body Election)ల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకే అంటూ వివరించారు. నాలుగు గైదు రోజుల్లో పీఏసీ(PAC) సమావేశం ఉంటుందన్నారు. పీఏసీ లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వయం ప్రతిపత్తిగల సంస్థలను నిర్విర్యం చేస్తున్నారన్నారు. ఈడీ(ED), సీబీఐ(CBI) కేసులు అన్ని ప్రతిపక్షాలపైనే పెడుతున్నారన్నారు. ఓక వ్యక్తి కి నాలుగు రాష్ట్రాలలో ఓటు హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్ఐఆర్(SIR) పేరిట పెద్ద మోసం జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారన్నారు.

Also Read: Bhatti Vikramarka: బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న భట్టి

అంశంపై క్రమశిక్షణ కమిటీ
పదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉంటారని ప్రకటించడంలో ఎలాంటి తప్పులేదన్నారు. తమ ప్రభుత్వం పై కాన్ఫిడెన్స్ పెంచడం కోసం సీఎం అలా మాట్లాడడం మంచిదేనని సపోర్టు చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి(Raja Gopal Reddy) ,అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) అంశంపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఆయా నేతలు మాట్లాడిన తీరు, సందర్భాన్ని పరిగణలోకి తీసుకొని కమిటీ పార్టీకి నివేదిక ఇస్తుందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చాలా మారాడని, పీసీసీ గా పనిచేసినప్పుడే రేవంత్ రెడ్డి వేరేగా ఉండేవాడని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉన్నదన్నారు.

బిల్లు పాస్ చేయనియ్యరా
పార్టీని బలోపేతం చేసి పదేళ్లు కాంగ్రెస్(Congress) ను పవర్ లో ఉంచేందుకు కష్టపడుతున్నారని కితాబిచ్చారు. ఇక అసెంబ్లీ లో బీసీ(BC) బిల్లు కు మద్దతు ఇచ్చిన బీజేపీ(BJP), కేంద్రం లో బిల్లు పాస్ చేయనివ్వడం లేదన్నారు. పదవుల భర్తీ పై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే పోస్ట్ లు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ లు ఇవ్వాలని ఎక్కువ విజ్ణప్తులు వస్తున్నాయన్నారు. మరోవైపు బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) లు కలిసి నెహ్రూ, సర్ధార్, సుభాష్​ చంద్రబోస్ చరిత్రలను కనుమరుగు చేసేందుకు కుట్రలు పన్నాయన్నారు. ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేయాలని చూస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ (EC)బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లా మారిపొవడం దారుణమన్నారు.

Also Read: Himayat sagar: నిండుకుండలా జంట జలాశయాలు.. పోటెత్తిన వరద

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..