Nadikuda mandal: ఏ గ్రామానికి అయినా ఒక జిల్లా ఒకే నియోజక వర్గం ఒక్కటే మండలం ఉంటుంది. కానీ ప్రస్తుత హనుమకొండ(Hanumakoda) జిల్లా నడికూడ మండలం వెంకటేశ్వర్లపల్లి(Venkateshwara pally) గ్రామం పరిస్థితి దానికి బిన్నంగా గజి బిజిగా ఉంది. తరుచు జిల్లాలు మారడంతోపాటు మండలాలు మారుతువస్తుంది. రెవెన్యూ(Revenue) కార్యకలాపాలు ఒక మండలంలో పంచాయతీ కార్యకలాపాలు మరో మండలంలో పోలీస్ స్టేషన్(Police Station) వ్యవహారాలు ఇంకో మండలంలో కొనసాగుతున్నాయి. ప్రాతినిధ్యం వహించేది ఒక మండలం ఓట్లు వేసేది మరో మండలానికి ఇలా అన్ని వ్యవహారాల్లో గందరగోళంగా మారిన వెంకటేశ్వర్లపల్లి గ్రామం పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం
మూడు జిల్లాలు, మూడు మండలాలు మారిన గ్రామం
పూర్వపు వరంగల్(Warangal) జిల్లాల్లోని పరకాల మండలం నార్లపూర్(Narlapur) రెవెన్యూ గ్రామ పరిధిలో వెంకటేశ్వర్లపల్లి గ్రామం. 2017 లో జిల్లాల పునర్విభజన తరువాత వరంగల్(Warangal) అర్బన్ జిల్లాలోని కమలాపూర్(Kamalapur) మండలంలో ఈ గ్రామాన్ని కలిపారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లాగా మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన నడికూడ మండలంలో వెంకటేశ్వర్లపల్లి గ్రామాన్ని కలిపారు. ఇలా వెంకటేశ్వర్ల పల్లి గ్రామాన్ని ఆరు సంవత్సరాల కాలంలో మూడు జిల్లాలు మూడు మండలాల్లో తెలిపారు.
మూడు మండలాల్లో మూడు శాఖల కార్యకలాపాలు
సుమారు 1300 ఓటర్లు 3000 పైగా జనాభా కలిగిన వెనకేశ్వర్లపలి గ్రామానికి సంబంధించి పాలన గందరగోళంగా సాగుతుంది. పంచాయితీ రాజ్ వ్యవహారాలు కమలాపూర్(Kamalapur) మండలంలో నిర్వహిస్తుండగా రెవెన్యూ(Revenue) వ్యవహారాలు నడికూడ మండలంలో పోలీస్ స్టేషన్(Police Stataion) వ్యవహారాలు పరకాల మండలంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ గ్రామంగా మార్చాలని అన్ని వ్యవహారాలు ఒకే మండలంలో ఉండేటట్టు చూడాలని గ్రామస్థులు కోరుతున్న పాలకులు అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ వసూళ్లలో అక్రమాలకు చెక్.. కుదిరిన ఒప్పందం
ఇటు ఓట్లు.. సీటు అటు
హనుమకొండ(Hanumakonda) జిల్లా నడికూడ(Nadikuda) మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ పంచాయతీ నార్లపల్లి(Narkapally) రెవెన్యూ గ్రామ పరిధిలో ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elaections) ఎంపీటీసీ(MPTC) స్థానం కమలాపూర్ మండలం మర్రిపల్లి ఓటర్లతో కలిపి ఎంపీటీసీ(MPTC) నియోజక వర్గం రూపొందించారు. ఇప్పటికి అదే పరిస్థితి ఉండడంతో ఓటర్లు,పోటీ చేసేందుకు సిద్ధం అయిన ఆశావహులు గందరగోళంలో పడ్డారు. మండల పరిషత్ నడికూడ పరిధి కాగా ఓట్లు మాత్రం కమలాపూర్ మండలం మర్రిపల్లి గ్రామ ఓట్లు ఉండడం గందరగోళం ఆందోళన కలిగించేలా తయారు అయింది.
అద్భివృద్ధిపై పట్టింపు ఏది
మండలాలు, జిల్లాలు మార్పు. గ్రామ, మండల పరిషత్, జిల్లా పరిషత్ కు జరిగే ఎన్నికల్లో గంధరగోల పరిస్థితి నెలకొనడమే కాదు. అభివృద్ధిలోను అదే పరిస్థితి నెలకొంది. గ్రామంలో అనేక సమస్యలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రహదారి(Road) సదుపాయం సరిగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చి ఒకే మండలంతో సంబంధం ఉండేలా పునర్విభజన చేసి ప్రత్యేక ఎంపీటీసీ(MPTC) స్థానం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గందరగోల మా గ్రామాన్ని గట్టు ఎక్కించాలి
మా గ్రామం హనుమకొండ(Hanumakonda) జిల్లా నడికుడి మండలం వెంకటేశ్వర్లపల్లి తరచూ జిల్లాలు మారాయి. మండలాలు మారాయి. రెవెన్యూ గ్రామ ఒకచోట గ్రామపంచాయతీ మరొకచోట. పరకాల అసెంబ్లీకి, వరంగల్ పార్లమెంటు స్థానాలకు మేము ఓట్లు వేస్తున్నాం. గ్రామపంచాయతీ, మండల పరిషత్ జిల్లా పరిషత్ ఓట్లు మాత్రం కమలాపూర్(Kamalapur) మండలానికి వేయాల్సి వస్తుంది. ఈ గందరగోళ్ల పరిస్థితి నుంచి మా గ్రామాన్ని ప్రభుత్వం వెంటనే గట్టెక్కించాలని బత్తిని ప్రశాంత్, వెంకటేశ్వర్ల పల్లి గ్రామస్థుడు తెలిపాడు.
ప్రత్యేక ఎంపిటిసి స్థానం ఇవ్వాలి
మా గ్రామం మండలం నడికూడ(Nadikuda)లో ఉండగా పోలీస్ స్టేషన్ పరకాల మండలంలో ఉంది. రెవెన్యూ వ్యవహారాలు కమలాపూర్(kamalapur) మండలంలో ఉన్నాయి. పనుల కోసం మేము గిరగిర తిరగాల్సి వస్తుంది. జిల్లాల పునర్విభజన తర్వాత మా గ్రామం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మేము ఓట్లు ఎవరికి వేస్తున్నాము రేపు మా పనుల కోసం ఎవరిని ప్రశ్నించాలి అనే దానిపై క్లారిటీ లేకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు స్పందించి మా గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించి ప్రత్యేక ఎంపీటీసీ(MPTC) స్థానాన్ని కేటాయించాలని, అరుకాల మణి, వెంకటేశ్వర్ల పల్లి గ్రామస్తులు తెలిపోయారు.
Also Read: Drugs Seized: డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ దాడులు.. ఎండీఎంఏ గంజాయి స్వాధీనం