Raksha Bandhan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Raksha Bandhan: గద్వాల జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Raksha Bandhan: అనురాగం అనుబంధం ఆత్మవిశ్వాసం.. అన్నీ సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంబంధం, ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ఇది ఓ చిహ్నం. కలిసిమెలిసి పెరిగినా అల్లరి చేస్తూ గడిపినా.. కష్టాల్లో తోడుగా నిలిచినా సోదర సోదరీమణుల ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో రక్షాబంధన్ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుకలకు సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్క చెల్లెళ్లు అన్నదమ్ములను కలిసి రాఖీలు కట్టారు. జిల్లాలో పవిత్రమైన రక్షాబంధ‌న్ సందర్భంగా సోదరుల ఇళ్ళకు సోదరీమణులు రాకతో పండగ వాతావరణం నెలకొంది.

సీఎం రేవంత్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ(ZP) చైర్ పర్సన్ సరిత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రి పొన్నం ప్రభాకర్‌(Min Ponnam Prabhakar)కు రాఖి పౌర్ణమి పురస్కరించుకొని వారికి రాఖీ కట్టారు. ప్రతి మహిళ జీవితాలలో సుఖసంతోషాలు వెల్లువిరియాలని, ఆరోగ్యవంతమైన జీవితాలను పొందాలని సీఎం(CM) ఆకాంక్షించారు.

Also Read: Parks in Khammam: ఖమ్మం జిల్లాలో రెండు కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రతిపాదన

ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLa Krishna Mohan Reddy)కి ఆయన సోదరి, బ్రహ్మ కుమారీస్ పలువురు మహిళలు రాఖీలు కట్టగా, ఆయన సతీమణి బండ్ల జ్యోతి(Bandla Jyoti) నాయకులు రమేష్ నాయుడు, గడ్డం కృష్ణారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, తదితరులకు రాఖీ కట్టారు. అదేవిధంగా బిఆర్ఎస్(BRS) జిల్లా నాయకుడు బాసు హనుమంతు నాయుడు కు ఆయన నివాసంలో మోనేష్ కుటుంబ సభ్యులతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు.

Also Read: Huma Qureshi Cousin: పార్కింగ్ లొల్లి.. స్టార్ నటి కజిన్ దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా..!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!