CPM: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలను వీడనాడాలని మహబూబాబాద్ జిల్లా సిపిఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్(Srinivassa) డిమాండ్ చేశారు. సిపిఎం(CPM) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోడీ(Modhi) ప్రభుత్వం బిసి వ్యతిరేక విధానాలకు నిరసనగా మహబూబాబాద్ పట్టణం ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి అధ్యక్షతన నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనందరం ఆయన మాట్లాడుతూ..
బీసీలకు రిజర్వేషన్ల కోటలేదు
విద్య ఉద్యోగాలలో చట్టసభలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు సిపిఎం(CPM) పార్టీ బీసీ(BC)ల అందరిని ఏకం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మించి పోరాడుతామని అన్నారు. దేశంలో సకల రంగాలలో పనిచేస్తూ సంపద సృష్టిస్తున్నది బహుజనులేనన్నారు. 1992 వరకు బీసీలకు రిజర్వేషన్ల కోటలేదని ఎస్సీ(SC), ఎస్టీ(ST)లకు ఉన్న రిజర్వేషన్లు పోనూ అగ్రవర్ణాలే అధిక సంఖ్యలో ఉద్యోగాలలో చట్టసభలలో లబ్ధి పొందుతున్నారని అన్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో 56% ఉన్న బీసీ(BC)లు 42 శాతం రిజర్వేషన్లు అడగడంలో తప్పేమిటి అని ప్రశ్నించారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
పార్లమెంటులో చట్టం చేయాలి
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అని దుయ్యబట్టారు. వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిజెపి(BJP) కేంద్ర మంత్రులు ఎంపీ(MP)లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బిజెపి(BJP)కి పతనం తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి. బీసీల రిజర్వేషన్ల పట్ల బీజేపీ ఆడుతున్న నాటకాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం 42 శాతం బిసి(BC) రిజర్వేషన్ల పై కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడకుండా యుద్ధం చేయాలని అన్నారు.
Also Read: Jangaon district: ప్రజల ప్రాణాలు కాపాడండి.. సీపీఎం నేత డిమాండ్