Swetcha Effect:(IMAGE credit: twitter)
నార్త్ తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛలో ప్రచురితమైన చాలాన్ల దోపిడి కథనం వైరల్

Swetcha Effect: నిజాలను నిర్భయంగా రాస్తూ  అచిరకాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్న స్వేచ్ఛ లో ప్రచురితమైన చాలాన్ల దోపిడి కథనం విస్తృతంగా వైరల్ అవుతోంది. సూర్యాపేట జిల్లా(Suryapet District)లో ఏ ప్రధాన కూడళ్లలో నలుగురు కలిస్తే చాలాన్ల దోపిడీపైనే చర్చ సాగుతుండడం గమనార్హం. పోలీసుల చేష్టలకు విసిగి వేసారిన వాహనదారులు స్వేచ్ఛ(Swtcha) ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. బొజ్జ గూడెం తండా ఫ్లై ఓవర్ కింద సాగుతున్న, కోదాడ పోలీస్ స్టేషన్(Kodada Police Station) పరిధిలోను జరుగుతున్న పోలీసుల అక్రమ చర్యలపై, జరిగిన పరిణామాలపై “స్వేచ్ఛ”లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో వాహనదారుల్లో నూతన ఉత్సాహం కలిగించింది. వాహనదారులపై పోలీసులు చేస్తున్న అక్రమ వసూళ్ల నేపథ్యం పై స్వేచ్ఛలో కథనం రావడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: 3000 Year Old Skeletons: 3000 ఏళ్ల క్రితం జరిగిన బలిదానాలు.. బయటపడ్డ 14 అస్థిపంజరాలు.. ఎక్కడంటే?

స్వేచ్ఛ కథనంతో దందాకు పాల్పడుతున్న వారిపై ఎస్పీ పోలీసులు ఆరా
సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని అనంతగిరి పోలీస్ స్టేషన్(Ananthagiri Police Station) పరిధిలో ఉన్న బొజ్జగూడెం తండా ఫ్లై ఓవర్ కింద జరుగుతున్న, కోదాడ పోలీస్ స్టేషన్(Kodada Police Station) పరిధిలో జరుగుతున్న అక్రమ వసూళ్ల కు పాల్పడిన పోలీస్ సిబ్బందిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులకు గురైన వాహనదారులు స్వేచ్ఛకు ప్రత్యేకంగా సమాచారాన్ని చేరవేశారు. దీంతో స్వేచ్ఛలో చాలాన్ల దోపిడి పేరిట కథనం వెలువడింది. ఈ కథనం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దృష్టి సారించారు. అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ సిబ్బంది పేర్లను స్వీకరించే పనిలో పడ్డట్టుగా విశ్వసనీయ సమాచారం.

సంబంధిత పోలీసుల దందాపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసే యోచన
అనంతగిరి పోలీస్ స్టేషన్(Ananthagiri Police Station) పరిధిలోని బొజ్జగూడెం తండా ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద జరుగుతున్న, అదేవిధంగా కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై పోలీసు సిబ్బంది పేర్లతో సహా నివేదిక తయారు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసే యోచనలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై పలువురికి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఫోన్లు చేసి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సంబంధిత పోలీసు సిబ్బందిపై శాఖ పరమైన చర్యలకు సన్నద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం ద్వారా తెలుస్తోంది.

Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..