3000 Year Old Skeletons: పెరూ ఉత్తర తీరంలో జరుగుతున్న పురవాస్తు తవ్వకాల్లో 3000 ఏళ్ల క్రితం నాటి అస్థిపంజరాలు బయటపడ్డాయి. మెుత్తం 14 మందికి సంబంధించిన అవశేషాలను పురావస్తు అధికారులు గుర్తించారు. వీరందరిని సజీవంగా పూడ్చిపెట్టినట్లు వారు పేర్కొన్నారు. దేశ పురావస్తు తవ్వకాల చరిత్రలో దీనిని మరుపురాని విజయంగా అభివర్ణించారు. పెరు దేశ ప్రాచీన చరిత్రకు ఇది అద్దం పడుతుందని పేర్కొన్నారు.
కుపిస్నిక్ సంస్కృతికి చెందిన ఒక బలి మందిరం సమీపంలో ఈ అస్థిపంజరాలను పరిశోధక బృందం కనుగొనింది. ఇందులో కొందరి మృతదేహాలు ముఖం కిందికి పెట్టి.. చేతులు వెనుక కట్టేసి పూడ్చి ఉంచబడ్డాయని పురవాస్తు అధికారులు తెలిపారు. ‘ఈ వ్యక్తులను పూడ్చిన విధానం సాధారణ పద్ధతికి భిన్నంగా ఉంది. వీరు జీవితంలో పొందిన గాయాలు అలాగే ఎదుర్కొన్న హింస కూడా విభిన్నంగా ఉన్నాయి’ అని తవ్వకాల బృందానికి నేతృత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త హెన్రీ టాంటాలీన్ చెప్పారు.
Archeologists have found the remains of 3,000-year-old human sacrifices in Peru https://t.co/MAV7CWxCVd pic.twitter.com/EdW7i3LGAk
— Reuters (@Reuters) August 8, 2025
Also Read: Modi Trump Salaries: ట్రంప్ వర్సెస్ మోదీ.. ఎవరి జీతం ఎంతో తెలుసా?
శరీరాలను పూడ్చిపెట్టిన విధానం చూస్తుంటే దీనిని మానవ బలిదానానికి చిహ్నంగా హెన్రీ పేర్కొన్నారు. పెరూలోని ఇతర ప్రదేశాల్లో కనుగొనబడిన సమాధుల తరహాలో వీరిని పూడ్చిన ప్రాంతంలో ధనభాండాగారాలు కనిపించలేదని అన్నారు. పైగా ఇసుక గుట్టల్లో చాలా సాదాసీదాగా పూడ్చిపెట్టారని హెన్రీ తెలిపారు. లిమా నగరానికి సుమారు 675 కిలోమీటర్లు (420 మైళ్లు) దూరంలో లా లిబర్టాడ్ ప్రాంతంలోని ఒక సముద్రతీరానికి సమీపంలో ఈ అస్థిపంజరాలను కనుగొనడం జరిగింది.