Modi Trump Salaries: భారత్ – అమెరికాల మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trum) తన దుందుడుకు చర్యలతో భారత్ ను బెదిరిస్తున్నాడు. ఆంక్షల పేరుతో ఇరాకటంలో పడేలా చేస్తున్నాడు. మరోవైపు భారత్ సైతం ట్రంప్ చర్యలకు దీటుగా బదులిస్తోంది. ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని భారత ప్రభుత్వం.. గతంలో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలకు బ్రేకులు వేస్తోంది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రంప్, ప్రధాని మోదీ తమ పరిధిలో విస్తృతమైన అధికారాలను ప్రదర్శిస్తున్నారు. అయితే వీరి మధ్య జీతాల పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉంది? ట్రంప్, మోదీ నెలవారీ జీత భత్యాలు ఎంత? ఈ కథనంలో పరిశీలిద్దాం.
ట్రంప్ జీతం, నెలవారీ ఖర్చులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్షికంగా 400,000 డాలర్లు జీతంగా అందుకుంటున్నారు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.3.36 కోట్లకు సమానం. వీటికి అదనంగా వ్యక్తిగత ఖర్చుల కోసం 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) చెల్లిస్తారు. అలాగే ట్రావెల్ ఖర్చుల కోసం లక్ష డాలర్లు (రూ.84 లక్షలు), వినోద ఖర్చుల కోసం 19,000 డాలర్లు (రూ.16 లక్షలు) కేటాయించబడతాయి. నెలవారీ తీసుకుంటే ట్రంప్ జీతం సుమారు 33,333 డాలర్లు (రూ.28 లక్షలు). ఇవి కాకుండా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ చేసే అదనపు ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తుంది. ఇందులో శ్వేతసౌధంలో నివాసం, భద్రత, సిబ్బంది సేవలు ఉన్నాయి. ఈ ఖర్చులకు ట్రంప్ వ్యక్తిగతంగా ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అయితే ట్రంప్ తన మెుదటి టర్మ్ (2017-2021)లో జీతాన్ని దానం చేసినట్లు పేర్కొన్నారు.
ట్రంప్ ఇతర ఆదాయాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. స్వతహాగా పెద్ద వ్యాపారవేత్త. ఆయనకు రియల్ ఎస్టేట్, హోటల్స్, గోల్ఫ్ కోర్సులు, లైసెన్సింగ్ డీల్స్ వంటి వ్యాపారాలు ఉన్నాయి. వాటి ద్వారా ట్రంప్ కు గణనీయమైన ఆదాయం అందుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు.. ప్రస్తుతం వ్యాపారాలను చూసుకుంటున్నారు.
ప్రధాని మోదీ జీత భత్యాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయానికి వస్తే ఆయన నెలవారీ జీతం రూ.2,00,000 (వార్షికంగా రూ.24 లక్షలు). ఇందులో బేసిక్ జీతం (రూ.50,000), ఖర్చుల భత్యం (రూ.90,000), నియోజకవర్గ భత్యం (రూ.70,000) ఇతర ఖర్చులు కలిసి ఉన్నాయి. ఈ జీతం 2012లో సవరించబడిన భారత ప్రధానమంత్రి వేతన నిబంధనల ప్రకారం ఉంది. వీటితో పాటు అధికారిక నివాసం, భద్రత (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్- SPG), రవాణా (ఎయిర్ ఇండియా వన్, హెలికాప్టర్లు), సిబ్బంది సేవలు ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. అదేవిధంగా దేశ, విదేశాల్లో పర్యటన ఖర్చులు, వసతి, ఆహారం వంటివి కూడా దేశ బడ్జెట్ నుంచే కేటాయించబడతాయి. అయితే ప్రధాని మోదీ తన వ్యక్తిగత ఖర్చులను చాలా పరిమితంగా ఉంచుతారని వార్తలు వచ్చాయి.
Also Read: BRS on BC Candidate: బీసీలపై గురిపెట్టిన బీఆర్ఎస్.. ఆర్మూర్ నుంచే స్టార్ట్.. వారి సీట్లు గల్లంతే!
మోదీ ఇతర ఆదాయ మార్గాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాపారాలు, ఆదాయ మార్గాలు లేవు. తన జీతంలో కొంత భాగాన్ని దానం చేస్తారని, సాధారణ జీవనశైలినే అయన అనుసరిస్తారని గతంలో భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ఇది కాకుండా ప్రధాని హోదాలో ఆయన వద్ద జాతీయ సహాయ నిధి (PMNRF) ఉంటుంది. విపత్తు సహాయం కోసం దాని నుంచి ప్రధాని మోదీ నిధులు కేటాయిస్తూ ఉంటారు. రైలు, రోడ్డు, ప్రకృతి విపత్తులో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియో ప్రకటించడం వంటివి చేస్తుంటారు. మెుత్తంగా చూసుకుంటే నెలవారి జీతం రూ.28 లక్షలు కాగా.. మోదీ జీతం రూ.2 లక్షలుగా ఉంది.