Bihar Voters: బిహార్‌లో ప్రతిపక్ష పార్టీల ఓట్లను ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై బీజేపీ(Bjp)కి అనుకులంగా మారడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య తీవ్రంగా ఖండించారు. చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ సంస్థల నిర్విర్యానికి పాల్పడుతున్న బీజేపీ(BJP)విధానాలను దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మెదక్(Medak) పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిహార్‌లో అర్హులైన 65 లక్షల మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలన్నారు.
Also Read: Jogulamba Gadwal: వర్షంతో జీవం పోసుకున్న పంటలు.. రైతన్నల ముఖాల్లో వెలుగులు
బీజేపీ అధికార దుర్వినియోగం
కుల, మత ప్రాతిపదికగా ఓటర్ల తొలగింపు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. బిహార్‌లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటూ, స్థానికంగా ఉపాధి పొందుతున్న ప్రజలను ఓటరు జాబితా నుంచి తొలగించడం అన్యాయం అన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీని అడ్డుపెట్టుకొని బీజేపీ(BJp) అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ(BJP) అధికారం దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుందని తెలియజేయడానికి ఇదొక నిదర్శనం అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, మరికొన్ని రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డం పెట్టుకొని తమ విధానాలకు మద్దతు పలకని వారిని వేధించడం పరిపాటిగా మారిందని అడివయ్య విమర్శించారు.
Also Read: Hydraa: మల్కం చెరువు మునక కారణాల అన్వేషణ.. కమిషనర్ రంగనాథ్