Medak District: పోలీసుల చేతిలో గాయపడిన దళితులను వెంకటయ్య పరామర్శించారు. ఘటనపై బాధితులు చంద్రం, రత్న, సంజీవ్, గ్రామస్తులు వివరించారు. చేగుంట ఎస్ఐ దళితవాడపై పడి దౌర్హన్యానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌కు వివరించారు.
Also Read: CV Anand: హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక గౌరవం.. నగర భద్రతలో నంబర్ వన్
బైంసా పోలీసుల తప్పిదం
బాధితులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, పోలీసుల( Police) వేధింపులకు మైసయ్య మరణించినందున పొలీసులపై హత్యా నేరంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఛైర్మన్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ బైంసా పోలీసుల తప్పిదం, చేగుంట పోలీసుల అత్యుత్సాహం వల్లనే దళితులపై దాడి జరిందని ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించారు. దాడి బాధాకరం, అమానుషమని విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తుప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, చేగుంట తహసీల్దారు శ్రీకాంత్‌లను ఆదేశించారు.
Also Read: TS News: కలెక్టర్‌పై గరంగరమైన ఎమ్మెల్యేకు ఉద్యోగుల సీరియస్ వార్నింగ్