Viral Video: ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌పూల్‌లో మాదక ద్రవ్యాల విక్రయం చేస్తున్న ఓ గ్యాంగ్ ను మాట్లాడే చిలుక పట్టించింది. ‘టూ ఫర్ 25’ వంటి డ్రగ్ డీలర్ల కోడ్ భాషను చిలుక పునరావృతం చేసిన వీడియోలు పోలీసులకు లభించడంతో అందులో ప్రమేయమున్న మెుత్తం 15 మంది సభ్యులు వారి నాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
డ్రగ్ మాఫియా సమాచారం అందుకున్న ఇంగ్లాండ్ పోలీసులు.. బ్లాక్‌పూల్‌లో ఓ ఇంటిపై దాడులు చేశారు. అక్కడ వారికి పెద్ద మెుత్తంలో హెరాయిన్, కోకైన్, నగదు, గ్యాంగ్‌కు సంబంధించిన ఫోన్లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఆ గ్యాంగ్ ను జైలు నుంచే ఆడమ్ గార్నెట్ (35) అనే వ్యక్తి నడిపించాడని తేలింది. దీంతో అతడి సెల్ లో శోదాలు నిర్వహించిన పోలీసులకు ఓ ఫోన్ దొరికింది. అందులో అతడి ప్రేయసి షానన్ హిల్టన్ (29) పెంచుకుంటున్న చిలుక వీడియోలు ఉన్నాయి. చిలుక డ్రగ్ మనీతో ఆడుకుంటూ మాట్లాడుతున్న దృశ్యాలు పోలీసుల చేతికి చిక్కాయి.
Massive crack and heroin ring brought down by drug dealer’s squealing pet parrot https://t.co/5wOHHl45qy pic.twitter.com/qyzjpsmZfu
— New York Post (@nypost) August 7, 2025
Also Read: Bandi Sanjay: కేసీఆర్‌కు వావి వరుసలు లేవ్.. కూతురు, అల్లుడు ఫోన్ ట్యాప్ చేయించారు.. బండి
103 ఏళ్ల జైలు శిక్ష
ఆ వీడియోలో ఓ పిల్లవాడి ముందు ’25కి రెండు’ అని చిలుకతో షానన్ అనడాన్ని పోలీసులు గుర్తించారు. ఇది డ్రగ్ అమ్మకానికి సంబంధించినదిగా తేల్చారు. అనంతరం ఆమెతోపాటు గార్నెట్ సహచరులైన దల్బీర్ సందు, జాసన్ గెరాండ్ తదితర 15మంది సభ్యులను కనుగొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గార్నెట్ జైలులో ఉన్నప్పటికీ ముఠా సభ్యులతో కమ్యూనికేషన్ కొనసాగించాడని ఇంగ్లాండ్ పోలీసులు తెలిపారు. అటు ముఠా సభ్యులు సైతం.. డ్రగ్ సరఫరా గురించి అంగీకరించినట్లు పేర్కొన్నారు. వారందరికి 103 ఏళ్ల శిక్షను న్యాయస్థానం విధించిందని అన్నారు. మాట్లాడే చిలుక వీడియోలు ఈ కేసులో ఎంతో కీలకంగా మారాయని వివరించారు.