Wedding Dates: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. ఈ సృష్టిలో అతి పవిత్రమైన రిలేషన్స్ లో భార్య భర్తల బంధం కూడా ఒకటి. అటువంటిది కొన్ని జంటలు.. ఈ బంధానికి తూట్లు పొడుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకొని జీవిత భాగస్వామిని అంత చేస్తున్నాయి. భర్త భార్యను, భార్య భర్తను దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 3 నెలల పెళ్లి ముహోర్తాలను వేద పండితులు ప్రకటించగా.. దానిపై నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెలల వారీగా ముహుర్తాలు..
ఈ ఏడాది మే నెలతో పెళ్లికి ముహూర్తాలు ముగియడంతో అప్పటి నుంచి పెళ్లి బాజాలు ఆగిపోయాయి. అయితే శ్రావణమాసం ఆరంభం కావడంతో గత నెల 26 నుంచి పెళ్లి ముహోర్తాలు మెుదలయ్యాయి. ఆగస్టు నుంచి ఏ నెలలో ఏ రోజులు పెళ్లికి అనుకూలంగా ఉన్నాయో తెలిపే జాబితాను వేద పండితులు ప్రకటించారు. దీని ప్రకారం ఆగస్టు మాసంలో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, సెప్టెంబరులో 24, 26, 27, 28, అక్టోబరు మాసంలో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31, నవంబరు 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 లలో శుభ ముహుర్తాలు ఉన్నాయి.
నెటిజన్లు సెటైర్లు..
అయితే ఇటీవల కాలంలో భర్తలను భార్యలు కడతేరుస్తున్న నేపథ్యంలో.. పైన పేర్కొన్న పెళ్లి ముహోర్తాలపై తమదైన శైలిలో నెటిజన్లు స్పందిస్తున్నారు. అటు మీమర్స్ సైతం ఈ ముహోర్తాలతో ఫన్నీ పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. ఆ ముహూర్తాల్లో పెళ్లి చేసుకున్న వారిలో ఎన్ని శవాలు లేస్తాయోనంటూ పోస్టులు పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు చూసి.. తనకు పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ‘పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటే.. ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?’ అంటూ మరొకరు ప్రశ్నించారు. మెుత్తంగా ఈ ఏడాది పెళ్లి ముహోర్తాలు.. నెటిజన్లను ఏ స్థాయిలో ఆందోళనకు గురి చేస్తుందో వారి కామెంట్స్ ను బట్టే అర్థమవుతోంది.
Also Read: Cyber Fraud: ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి.. రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు..!
భర్తను భార్య చంపిన ఘటనలు
వివాహేతర సంబంధాల కారణంగా భర్తలను భార్యలు అతి క్రూరంగా హత్య చేస్తున్నారు. మహారాష్ట్ర నలసోపర ప్రాంతంలో కోమల్ చవాన్ అనే మహిళ తన ప్రియుడు మోనుతో కలిసి తన భర్త విజయ్ చవాన్‌ను హత్య చేసింది. హైదరాబాద్ కుత్బుల్లా పూర్ లో గత నెల జ్యోతి అనే మహిళ తన భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి పథకం వేసింది. వారు రాందాస్‌ను బౌరంపేటకు తీసుకెళ్లి, మద్యం తాగించి, బీరు బాటిళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ నెలలో కరీంనగర్ కు చెందిన రమాదేవి అనే మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. యూట్యూబ్‌లో చూసిన వీడియో ఆధారంగా భర్తకు మద్యం తాగించి చెవిలో పురుగుల మందు పోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో జయశ్రీ అనే మహిళ తన భర్త వెంకటేష్ ప్రాణాలు తీసింది. మేఘాలయ హనీమూన్ ఘటనలో సోనమ్ రఘువంశీ అనే మహిళ.. తన ప్రియుడు సుపారీ గ్యాంగ్ తో భర్తను అతిదారుణంగా హత్య చేసింది.