Muthyalamma temple ( imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Muthyalamma temple: గుడికి రోడ్డు లేక భక్తుల తంటాలు.. పట్టించుకోని అధికారులు

Muthyalamma temple: పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి(Rayaparthi) మండలం ఊకల్ గ్రామంలో వెలసిన ముత్యాలమ్మ గుడికి రహదారి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ప్రతీ సంవత్సరం ముత్యాలమ్మకు మొక్కులు తీర్చేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నప్పటికీ, ఆలయానికి వెళ్లే మార్గం లేకపోవడంతో విడుదల పడుతూ లేస్తూ నడవాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు(Road) సమస్య వల్ల కొంతమంది గుడి దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇన్నేళ్లుగా పాలకులు మారినా మా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా ఆక్రమించుకున్న భూమి

గత ప్రభుత్వ కాలంలో కూడ రహదారి పై పట్టించుకోకపోవడంతో ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే(MLA)కు రహదారి సమస్యను తెలియజేయగా, త్వరలో రహదారి వేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికీ ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని వెలికి తీసి, రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Bhatti Vikramarka: కొల్లాపూర్‌లో నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాను

ఎప్పుడు మాకీ బాధల నుంచి విముక్తి..? ఎప్పుడు మా అమ్మవారి దర్శనానికి సులభంగా వెళ్లగలుగుతాం..? అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థుల మండిపడుతున్నారు. రోడ్డు సమస్య తీరకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్‌లో పాలకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక హిందూ పండుగ

బోనాలు అనేది తెలంగాణ(Telangana) రాష్ట్రానికి సబందించిన ప్రత్యేక హిందూ పండుగ. దీన్ని అమ్మవారి పండుగగా అని కూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది చాలా ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. ప్రజలు మహంకాళి, యల్లమ్మ, ముత్యాలమ్మ దేవతలకు బోనాలు సమర్పిస్తూ మొక్కుకుంటారు. ఈ పండుగ పుట్టుక అనేది 1869లో హైదరాబాద్(Hyderabad) పట్టణంలో ప్లేగు వ్యాధి(Plague) వ్యాప్తి పెరిగిన సమయంలో జరిగింది. దీంతో నాటి ప్రజలు మహంకాళి అమ్మవారికి ప్రార్థించి, మహమ్మారి (బీమారు) తగ్గిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించటం ప్రారంభించారు దీంతో ఆ నాటి నుండి నేటివరకు ఈ పండుగ జరుపుకుంటున్నారు.

Also Read: Old City Metro: పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం.. పిల్లర్ల మార్కింగ్ పనులు షురూ!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?