Gadwal’s Jodu Panchalu: గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ నిష్ఠలతో నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతుంది. నాటి నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు గద్వాల(Gadwala)లో చేపట్టిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెల నేత ప్రక్రియ భక్తి భావంతో కొనసాగుతోంది
సెప్టెంబర్ 23న స్వామివారికి ఏరువాడ జోడు పంచెల అంకురార్పణం కార్యక్రమం ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 24 న అఖిలాండ బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ఈ జోడు పంచలను స్వామివారికి ధరింప చేస్తారు. ఏరువాడ జోడు పంచెల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం గద్వాల సంస్థానాధీశురాలు శ్రీలతా భూపాల్(Srilatha Bhupal) కు లేఖ రాసింది. ఈ నెల 28న ఏరువాడ జోడు పంచెలను టీటీడీ(TTD) అధికారులకు మహంకాళి కరుణాకర్(Karunakar) అందజేయనున్నారు . ముగ్గురు చేనేత కార్మికులు 41 రోజులుగా నిష్ఠతో శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను తయారు చేస్తారు.
వారసత్వంగా సమర్పణ
నాలుగు శతాబ్దాలకు పైగా గద్వాల సంస్థానాధీశులు తమ వంశ పెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీ వేంకటేశ్వరునికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వేంకటేశ్వరునికి ఉత్సవాల మొదటిరోజు, విజయ దశమి రోజున ఈ ఏరువాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్(Seetharam Pal) తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం గద్వాల(Gadawala) సంస్థానాదీశురాలైన శ్రీలత భూపాల్ జోడు స్వామి వారికి జోడు పంచెలు సమర్పించే బాధ్యతను చేపడుతున్నారు. తెలంగాణ(Telangana) నుంచి శ్రీవారికి అందుతున్న ఏకైక కానుక ఏరువాడ జోడు పంచెలు కావడం విశేషం. కృష్ణా(Krishna), తుంగభద్ర(Tungabhadra) నదుల మధ్య ఉన్నది నడిగడ్డ ప్రాంతం. గద్వాల కేంద్రంగా ప్రత్యేక చేనేత మగ్గంపై తయారు చేసే పంచెలను ఏరువాడ జోడు పంచెలు అంటారు.
Also Read: Viral Video: స్నేహితుడి చివరికోరిక తీర్చిన వ్యక్తి.. వైరల్ వీడియో ఇదిగో
నామాల మగ్గంపై తయారీ
జోడు పంచె(Jodu Pancha)ల తయారీకి ప్రత్యేకంగా నామాల మగ్గాన్ని తయారు చేయించారు. సాధారణంగా నేత మగ్గంపై ఇద్దరు లేదా ఒక్కరు మాత్రమే పనిచేస్తారు. నామాల మగ్గాన్ని మాత్రం ఒకే సారి అత్యంత నిపుణులైన ముగ్గురు నేయడం ప్రత్యేకత. పనిలో ఏ ఒక్కరు తప్పు చేసినా పంచె తయారీకి భంగం కలుగుతుందని కార్మికులు భావిస్తారు. జోడు పంచెల తయారీ మొదలుకుని వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు పరిశుభ్రతతో మగ్గం ఉన్న చోట, ఇంట్లో నిత్యం పూజలు చేయడం, గోవింద నామస్మరణ చేసుకుంటూ పనిని ప్రారంభిస్తారు. రెండు పంచెలను ఒకటిగా నేసి ఇవ్వడమే ఈ జోడుపంచెల ప్రత్యేకత.
ఎనిమిది కోటకొమ్ములు
ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచు ఉంటుంది. శ్రీవారికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను నల్లకుంట(Nallakunta) కాలనీలో ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యే భక్తిశ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను తయారు చేస్తారు. ఏరువాడ పంచెల తయారీలో నేత కార్మికులు సాక సత్యన్న(Saka Sathyanna), దామర్ల శణ్ముఖరావు(Shenmukarao), రమేష్(Ramesh). గోవింద నామాస్పరణ చేస్తూ నిష్ఠతో మగ్గంపై జోడు పంచెలను తయారు చేస్తున్నారు.
సంస్థానాధీశుల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్(Moolavirat) కు ధరింప జేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గత 14 ఏళ్లుగా స్వామివారికి సేవ చేసుకునే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాం. గద్వాల కార్మికులు ఎంతో నిష్టతో జోడు పంచెలు తయారు చేస్తారు . ఈ జోడు పంచెలను ఈనెల 28 న టీటీడీ ఈ వోకు ఆలయ గర్భగుడిలో స్వామివారి ఎదుట అందజేయనున్నారు.
Also Read: CM Revanth Reddy: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..