Khadgam Actress ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Khadgam Actress: విడాకులు తీసుకోబోతున్న రవితేజ హీరోయిన్.. పెద్ద హింటే ఇచ్చిందిగా?

Khadgam Actress:  తెలుగు సినీ ఇండస్ట్రీలో (Tollywood) “ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్” అంటూ తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఖడ్గం( Khadgam)సినిమా బ్యూటీ సంగీత క్రిష్ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి.

Also Read: Viral Video: తిమింగలానాన్ని బతికించిన ఏనుగులు.. సాక్షాత్తు దేవుళ్ళే దిగి వచ్చారుగా అంటున్న నెటిజన్స్

ఇటివలే సినీ తారల విడాకుల వార్తలు ఒక ట్రెండ్‌లా మారాయి. రీసెంట్ గా హన్సిక మోత్వానీ లాంటి హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ వివాహ ఫోటోలను తొలగించడం ద్వారా విడాకుల ఊహాగానాలకు ఆజ్యం పోసిన సందర్భాలు చూశాము. ఇప్పుడు సంగీత క్రిష్ కూడా ఇదే బాటలో నడుస్తోందనే చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అసలు ఇది నిజమో? కాదో? ఇక్కడ ఒకసారి చూద్దాం..

Also Read:  Naa anveshana: నా అన్వేష్ తో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య.. సంచలనం రేపుతున్న ఆడియో కాల్

సంగీత క్రిష్ విడాకుల రూమర్లు?

(Sangeetha Krish) సంగీత క్రిష్, 2009లో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ క్రిష్ (Singer Krish) ను వివాహం చేసుకుంది. ఈ జంటకు 2012లో శివియా అనే కుమార్తె జన్మించింది. అయితే, ఇటీవల సంగీత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరును Sangeetha Krish నుంచి Sangeetha.actగా మార్చడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెర లేపింది. సాధారణంగా సినీ తారలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో భర్త పేరును తొలగిస్తే విడాకులకు రెడీగా ఉన్నారనే సంకేతంగా భావిస్తారు. సంగీత ఈ మార్పు చేయడంతో, ఆమె క్రిష్ తో విడాకులు తీసుకోబోతోందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Also Read:  Students Fall ill: పురుగులు పట్టిన పిండితో ఇడ్లీ తయారు.. మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం

సంగీత తల్లితో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవే.. 

సంగీత తన తల్లితో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి గతంలో బహిరంగంగా మాట్లాడింది. 2019లో, తన తల్లి తనను బాల్యంలోనే నటన వైపు నెట్టి, ఆర్థికంగా దోపిడీ చేసిందని, తన సోదరుల సౌకర్యం కోసం తనను ఉపయోగించుకుందని ఆమె ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇది ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించింది. అయితే, క్రిష్ తో వివాహం తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. డబ్బు పరంగా కూడా సెటిల్ అయింది. ఇక, ఇప్పుడు విడాకుల పుకార్లతో మళ్లీ ఆమె వార్తల్లో నిలిచింది.

Just In

01

Telugu Reality Shows Impact: తెలుగు రియాలిటీ షోల వల్ల ఎంటర్‌టైన్మెంట్ తప్పుదారి పడుతుందా?.. అసలు వాటి వల్ల లాభమా?.. నష్టమా?

Medchal News: వివాదంలో శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయం.. నోటీసులు జారీ..!

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్