SHOCKING VIDEO: కొందరు మగవారు మృగంలా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆడ-మగ, తల్లి-బిడ్డ అన్న తేడా లేకుండా తమ కామ కోరికలు తీర్చుకునేందుకు మృగాడిలా ప్రవరిస్తున్నారు. తాజాగా ఓ ఉన్మాది.. ఒక అడుగు ముందుకేసి ఏకంగా వీధి కుక్కలపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అతడు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలోని పుణెలో ఓ వ్యక్తిపై విచిత్రకరమైన కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా వీధి కుక్కలపై అతడు అత్యాచారం చేస్తున్నాడంటూ యానిమల్ హవెన్ ఎన్జీఓ (NGO Animal Haven) సభ్యులు అతడిపై విశ్రాంత్వాడీ పోలీస్ స్టేషన్ (Vishrantwadi Police Station)లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎన్జీఓ సభ్యురాలు రాగిణి మోర్ (Ragini More).. నిందితుడి గురించి మాట్లాడారు. కర్ణాటకు చెందిన ఓ కూలి.. కుక్కలపై ఇలా అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆమె చెప్పారు.
సీసీటీవీలో రికార్డ్
తమ ఎన్జీఓకు చెందిన కార్యకర్త ఇచ్చిన సమాచారం ప్రకారం.. నిందితుడు 35 ఏళ్ల మల్లప్ప హోస్మాని (Mallappa Hosmani)గా గుర్తించినట్లు రాగిణి మోర్ అన్నారు. పుణెలోని టింగ్రే నగర్ (Tingre Nagar)లో ఓ ఆడ కుక్కను షెడ్డులోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయడం.. సమీపంలోని సీసీటీవీ (CCTV Video)లో రికార్డు అయినట్లు ఆమె తెలిపారు. వీడియోలో ఓ వీధికుక్కను బలవంతంగా షెడ్ లోకి తీసుకెళ్లడం స్పష్టంగా రికార్డ్ అయ్యిందని పేర్కొన్నారు. అతడు కుక్కలపై అత్యాచారం చేస్తున్నట్లు తేలిందని చెప్పుకొచ్చారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం ప్రకారం మల్లప్పపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#Pune: Tingrenagar Residents Allege Se*ual As*ault On Female Dogs By A Man; Visuals Surface#punenews #Maharashtra #dogs #maharashtranews pic.twitter.com/6zNHL6gCTn
— Free Press Journal (@fpjindia) August 5, 2025
Also Read: Viral Video: ఊర్లోకి వచ్చి.. కారులో ఇరుక్కుపోయిన మెుసలి.. భలే విచిత్రంగా ఉందే!
ఏప్రిల్‌లోనూ అంతే..
పుణెలో ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఓ వ్యక్తి కుక్కలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. హాండేవాడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. బెంగాల్‌కి చెందిన అలిముద్దీన్ (Alimuddin Aminal Shaikh) తన ఆడ కుక్కపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. కుక్క యజమాని సీసీటీవీ వీడియో చెక్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. విచారణలో షేక్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో బిఎన్‌ఎస్ సెక్షన్ 329, జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960 సెక్షన్ 11(1)(a) కింద కలేపడాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.