BRS on High Alert(image CREDIT: SWETCHA REPORTER)
Politics, లేటెస్ట్ న్యూస్

BRS on High Alert: హరీష్ రావుతో అచ్చంపేట నేతల భేటీ

BRS on High Alert: బీఆర్ఎస్(BRS) పార్టీ అలర్టు అయింది. నేతలు పార్టీ మారకుండా సంప్రదింపులు మొదలు పెట్టింది. పార్టీ వీడితే స్థానిక ఎన్నికల ముందు కేడర్ లో గంధర గోళ పరిస్థితి నెలకొంటుందని దీంతో మెజార్టీ సీట్లు కోల్పోవల్సి వస్తుందని భావిస్తుంది. ఎవరెవరు వెళ్తారనే పార్టీ ఆరా తీస్తుంది. ఎవరైతే కొంత అసంతృప్తితో ఉంటారో వారితో మాట్లాడుతున్నట్లు సమాచారం. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పార్టీ మారి రాజకీయ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్(brs) పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) అధ్యక్షుడిగా బాలరాజు కొనసాగుతున్నారు.అయితే ఆయన పార్టీకి ఊహించని విధంగా రాజీనామా చేయడంతో పార్టీ అలర్టు అయింది. ఇంకా ఎవరైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? అనేది ఆరా తీస్తుంది. అంతేగాకుండా ఎవరైనా నారాజ్ గా ఉన్నట్లు, పార్టీలో గుర్తింపు లేనట్లు భావిస్తున్నారా? అని ఆరా తీస్తు వారితో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో నేతలు, కేడర్ కొంత నైరాశ్యంలో ఉన్నారు. అయితే పార్టీ కార్యక్రమాలు సైతం స్తబ్దుగా ఉండటం, అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడం, బీజేపీ(Bjp) పార్టీకి సైతం యువతతో పాటు ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతుండటంతో బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

 Also Read: Ponguleti Srinivasa Reddy: ప్రజా పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయి: మంత్రి పొంగులేటి

అదే జరుగుతుందా?

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అప్పట్లో సంచలనం అయింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఫైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగాకాంతారెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే గువ్వల బాలరాజు ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేసి బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారు. నాడు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసేందుకు బీజేపీ నేత బీఎల్ సంతోష్ ప్రోద్బలం అనే ప్రచారం జరిగింది. ఆయితే మళ్లీ ఆయనే తెరమీదకు వచ్చారని, బాలరాజును బీజేపీలో చేర్చుకోబోతున్నట్లు సమాచారం. అయితే అదే ఫాం హౌజ్ లో సంప్రదింపులు జరిగిన వారిలో మరోముగ్గురు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో వారు సైతం పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం పార్టీ మారడం లేదని మీడియాకు క్లారిటీ ఇచ్చారు. అయితే ఏ నేత అయినా పార్టీ మారితే తాను మారుతున్నట్లు ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పుడుకూడా అదే జరుగుతుందా? అనే ప్రచారం జరుగుతుంది.

బీఆర్ఎస్ కోర్టులో ఫైట్

మరోవైపు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం పదిమంది మారుతారనే ప్రచారం ఊపందుకుంది. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అలాంటిదేమీ లేదని కేవలం దుష్రాచారం మాత్రమే అని కొట్టిపారేస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఇబ్బందులు పడుతున్నారని, ఆయా నియోజకవర్గాల్లో గ్రూపులు ఎక్కువయ్యాయని ప్రస్తుత పరిస్థితులే తెలియజేస్తున్నారు. అంతేకాదు వారు మళ్లీ పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్న మాట నిజమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీమారేందుకు ఎవరు సిద్ధంగా లేదని అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిరేపాస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కోర్టులో ఫైట్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మరొకరు పార్టీ మారేందుకు సిద్ధపడుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పార్టీ అధిష్టానం ఆరా

స్థానిక ఎన్నికల ముందు పార్టీ నేతలు ఎవరు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటుంది. రాబోయే ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ దే నని, అప్పుడు పార్టీ కోసం పనిచేసేవారికి ఖచ్చితంగా పదవులు వస్తాయని హామీలు ఇస్తున్నారు. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు సైతం ఇస్తామని కేటీఆర్, హరీష్ రావులు హామీ ఇస్తున్నారు. మరోవైపు కొంతమంది మాజీ మంత్రుల ఆధిపత్యంతో కింది స్థాయి నేతలు ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అలాంటి వారు ఎవరెవరు ఉన్నారనేది కూడా పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం.

దిశానిర్దేశం

త్వరలోనేవారికి సైతం క్లాస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అంతేగాకుండా పార్టీ నేతలందరిని కలుపుకొని పోవాలని దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు సమాచారం. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడంతో ఆనియోజకవర్గ నేతలకు ధీమా కల్పించేందుకు రెండుమూడ్రోజుల్లో హరీష్ రావు సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్ లో మంగళవారం ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావునుకలిశారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. సమావేశం ఏర్పాటుచేసి సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి వస్తానని హరీష్ రావు భరోసా ఇచ్చారు.

 Also Read: Cloud Burst: ఉత్తరాఖండ్‌‌లో ‘క్లౌడ్ బరస్ట్’ ప్రళయం.. గల్లంతైన ఇళ్లు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు