New Ration Cards: దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 35,335 కొత్త కార్డులు వచ్చాయి. కొత్త వారికి సెప్టెంబరులో రేషన్ కోటా కూడా మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)ను లబ్దిదారులకు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. ఆగస్టు 10వ తేదీలోగా పంపిణీని పూర్తిచేయనున్నారు. ఇటీవల అలంపూర్ చౌరస్తాలో మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,(Minister Vakiti Srihari,) ఎమ్మెల్యే విజయుడు పంపిణీ చేయగా, గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సంతోష్,(Collector Santosh) అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అర్హులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.పౌరసరఫరాలశాఖ అధికారులు ఆయా మండలాల్లో అందిస్తున్నారు. గ్రామాల్లో తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు, ఎంపీడీవో, ఎంపీవోలు ఇస్తున్నారు.
Also Read: Gadwal District: ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
అర్హుల గుర్తింపులో అలసత్వం లేకుండా
రేషన్ కార్డుల (Ration Cards) జారీని ప్రభుత్వం సులభతరం చేసింది. దరఖాస్తు చేసిన వారి వివరాలను విచారణ నిర్వహించి వారం, పది రోజుల్లోనే మంజూరు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేర్లు కూడా చకచకా చేరుతున్నాయి. కార్డులో మార్పులు చేర్పులతో పాటు తొలగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.దరఖాస్తుదారులు ఇప్పటికైనా కార్డు రాలేదని, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం లేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు పాత కార్డుల్లో పేరు ఉంటే నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి దాన్ని తొలగించుకోవాలి. ఆ తర్వాత మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే సకాలంలో విచారణ చేపట్టి మంజూరు చేస్తున్నారు.
ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.. డీఎస్ఓ స్వామి కుమార్
జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో కొత్త రేషన్ కార్డు(New Ration Cards)లో కుటుంబసభ్యుల పేర్లను చేర్పించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగనుంది. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే చాలు. అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి అర్హులో కాదో నిర్ణయిస్తారని డీఎస్ఓ స్వామి కుమార్(DSO Swami Kumar) తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపడుతున్నాం. పాత కార్డుల్లో పేరు ఉంటే ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత కొత్త దాని కోసం మీ- సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేషన్ కార్డుల వివరాలు
❄️వచ్చిన దరఖాస్తులు : 35,335
❄️క్యాంపుల నిర్వహణ : 6
❄️నేటి వరకు పంపిణీ చేసినవి : 20075
❄️మొత్తం పంపిణీ శాతం : 57%
❄️పంపిణీకి పెండింగ్ లో ఉన్నవి : 15260
Also Read: Gadwal district: గద్వాల జిల్లా కలెక్టర్‌కు అరుదైన గౌరవం.. సన్మానించిన ఉద్యోగులు