Gender Determination Test: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అర్హతకు మించి ఆర్ఎంపీ వైద్యులు వైద్యం చేయొద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్ భూక్య రవి( Ravi) రాథోడ్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో డి.ఎస్.పి తిరుపతిరావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నెహ్రూ, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ సుంకరనేని నాగవాణి, మెంబర్స్, సంబంధిత వైద్య అధికారులతో కలిసి జిల్లాలోని ఆర్ఎంపి లతో సమీక్ష సమావేశం జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ నిర్వహించారు.
Also Read: India on US Tariff: అమెరికా, ఈయూకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. లెక్కలు తీసి మరి చురకలు!
అర్హతకు మించి వైద్యం చెయ్యొద్దు
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి(Ravi) రాథోడ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో లింగ నిర్ధారణ పరీక్షలు, అర్హతకు మించి వైద్యం చేయడం, తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ సూచనల ప్రకారం మాత్రమే వైద్య సేవలు కొనసాగించాలని అన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో క్షేత్రస్థాయిలో ఆర్ఎంపి సెంటర్లను సందర్శించగా అనధికారికంగా వైద్య సేవలు కొనసాగిన దృశ్యాలను గమనించడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అర్హతకు మించి వైద్యం చెయ్యొద్దని ఆర్ఎంపి వైద్యులను ఆదేశించారు.
డిఎస్పి తిరుపతిరావు మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో ఆర్ఎంపి వైద్యుల సేవలు బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎంతో సేవలు అందించారని వారికి గుర్తుకు చేశారు.సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నాగవాణి, మెంబర్స్ పరికిపండ్ల అశోక్, అధ్యక్షుడు డాక్టర్ నెహ్రూ, సంబంధిత వైద్యులు, ప్రోగ్రాం అధికారులు ఆర్ఎంపి వైద్యులకు తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కె ప్రసాద్, రాజు, ఆర్ఎంపి వైద్యుల సంఘం నుండి రవీంద్రాచారి, నజీర్, అధిక సంఖ్యలో ఆర్ఎంపి, పి ఎం పి వైద్యులు పాల్గొన్నారు.
Also Read: Case on Namrata: డాక్టర్ నమ్రతకు బిగుస్తున్న ఉచ్చు.. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి