Fraud Loans: ముద్ర రుణాల పేరుతో మహిళలను మోసం చేసిన షేక్ జానీ అలియాస్ హరినాథ్ రావు అనే వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌కు చెందిన షేక్ జానీ 2020లో కరోనా కారణంగా తన ఉద్యోగం కోల్పోయి ఆర్థిక సమస్యల్లో పడ్డాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో ముద్ర రుణాల గురించి తెలుసుకుని, వాటిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడాలని పథకం వేసుకున్నాడు.
Also Read: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!
బైక్‌ను పోలీసులు స్వాధీనం
చిరు వ్యాపారం చేసుకునే మహిళలను టార్గెట్ చేసి, ప్రభుత్వం ముద్ర రుణాలు ఇస్తుందని, కొంత డబ్బు ఇస్తే వాటిని మంజూరు చేయిస్తానని నమ్మబలికాడు. పలువురు మహిళల నుంచి డబ్బులు తీసుకుని, వారికి రుణాలు ఇప్పించకుండా పారిపోయాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు నమోదయ్యాయి. నాలుగేళ్లుగా పరారీలో ఉన్న షేక్ జానీని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఒక ఆపిల్ ఐఫోన్, ఒక రెడ్‌మీ 7ఏ సెల్‌ఫోన్, ఒక మారుతి బ్రెజా కారు, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు.
Also Read: CM Revanth Reddy: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..