CC Roads at Shaikpet: జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి.. మంత్రి
CC Roads at Shaikpet( image CREDIT: swetcha REPORTER)
హైదరాబాద్

CC Roads at Shaikpet: జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

CC Roads at Shaikpet: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao)స్పష్టం చేశారు. షేక్‌పేట డివిజన్‌లోని వినాయక్‌నగర్‌లో రూ.1.05 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,(Tummala Nageswara Rao) వివేక్ వెంకటస్వామి,)(Vivek Venkataswamy)మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.

 Also Read: Coolie Vs War 2: ఓవర్సీస్ లో ‘కూలీ’ Vs ‘వార్ 2’ సినిమాల్లో గెలుపెవరిదంటే..

సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

హైదరాబాద్‌ను ఒక గొప్ప విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC) ద్వారా ప్రతి డివిజన్‌లోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కార్పొరేటర్లు, అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)మాట్లాడుతూ.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డులలో సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బందిని కోరారు.

అత్యుత్తమ నగరం

మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌ను, జూబ్లీహిల్స్‌ను దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు తీసుకువస్తే పనులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Heavy Rains: గచ్చిబౌలిలో పిడుగుపాటు.. పరుగులు తీసిన జనం..

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..