Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలో రాత్రి ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇల్లు మార్కెట్‌లో ఉంది, అక్కడ పూల దుకాణం, మొబైల్ ఫోన్((Mobile phone) షాపు కూడా ఉన్నాయి.
Also Read: Ramachandra Rao: కాంగ్రెస్‌కు లోకల్ ఆలోచన లేదు.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్!
ముగ్గురు తీవ్ర గాయలు
సిలిండర్(cylinder)పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి పేలుడు తాకిడికి అక్కడికక్కడే మరణించారు. సమీపంలో వెళ్తున్న బోరు లారీలో ఉన్న ఒకరికి కూడా గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు పక్కన ఉన్న ఇల్లు కూడా ధ్వంసమై, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Viral Video: ఇదేం వెర్రితనం.. సింహంతో చెలగాటమా.. అదృష్టం బాగుండి బయటపడ్డావ్ గానీ..!