Ramachandra Rao(imge CREDIT: TWITTER)
Politics, లేటెస్ట్ న్యూస్

Ramachandra Rao: కాంగ్రెస్‌కు లోకల్ ఆలోచన లేదు.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్!

Ramachandra Rao: కాంగ్రెస్‌కు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఏమాత్రం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) విమర్శలు చేశారు. నిర్వహించినా.. పాత రిజర్వేషన్ల ఆధారంగా దీన్ని పూర్తి చేయాలని హస్తం పార్టీ భావిస్తున్నదని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్(Congress) నేతలు ఢిల్లీకి తీసుకెళ్తున్నారని, కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదని మండిపడ్డారు. అందుకే 42 శాతం బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పలేదని గుర్తుచేశారు.

Also Read: Case on Namrata: డాక్టర్ నమ్రతకు బిగుస్తున్న ఉచ్చు.. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి

బీసీలకు పూర్తిగా 42 శాతం

ఇప్పుడు ఆర్డినెన్స్‌లో కూడా వాళ్లే రాష్ట్రపతికి మార్క్ చేసి మరీ కాపీ ఇచ్చారని, అసలు రాష్ట్రపతికి మార్క్ చేసి ఇవ్వడానికి వాళ్లెవరని రాంచందర్ రావు(Ramchandra Rao) ప్రశ్నించారు. ఇవన్నీ నాటకాలు మాత్రమేనని ఆయన ఫైరయ్యారు. హైదరాబాద్‌(Hyderabad)లో నాటకాలు చేసినవి సరిపోక ఢిల్లీకి వెళ్లారన్నారు. కాంగ్రెస్‌(Congress)కు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. బీసీలకు పూర్తిగా 42 శాతం ఇస్తామని స్పష్టం చేస్తే పూర్తి మద్దతు తామిస్తామని వెల్లడించారు.10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలను మోసం చేసినట్లు కాదా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. దీనిపై ప్రశ్నిస్తే బీజేపీ(BJP) అడ్డుకుంటోందని విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్(Congrss) పార్టీయే హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్(Congress) మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని, ఓబీసీలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్(Congress) వ్యవహరిస్తున్నదని విరుచుకుపడ్డారు.

రాంచందర్ రావు జిల్లాల పర్యటన
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) ఈ నెల 5, 6 తేదీల్లో పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లాలో తొలుత ఆయన పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మేధావులతో భేటీ అవుతారు. ఆపై మధ్యాహ్నం 2:30 గంటలకు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రైతులు, బీజేపీ(Bjp) నాయకులతో ఆయన సమావేశం ఇవ్వనున్నారు.

ప్రముఖులతో భేటీ

ఈ మీటింగ్ తర్వాత సాయంత్రం 4 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు. అనంతరం డాక్టర్లు, న్యాయవాదులు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతారు. ఇదిలా ఉండగా అదేరోజు సాయంత్రం 6 గంటలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చేరుకుంటారు. అనంతరం జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈనెల 6న కాగజ్‌నగర్‌లో పలువురు ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన మేధావులు, డాక్టర్లు, లాయర్లతో ఆయన సమావేశమవ్వనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రామగుండంలో జరిగే స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు.

 Also Read: Yadadri Thermal Power: భూ నిర్వాసితుల‌కు అన్నివిధాలా న్యాయం: డిప్యూటీ సీఎం

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ