Viral Video (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: ఇదేం వెర్రితనం.. సింహంతో చెలగాటమా.. అదృష్టం బాగుండి బయటపడ్డావ్ గానీ..!

Viral Video: సింహం సహనాన్ని పరీక్షించి తృటిలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ ఘటన గుజరాత్ (Gujarath)లో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భావ్‌నగర్‌ (Bhavnagar)లో జరిగిన ఈ ఘటనలో ఒక వ్యక్తి సింహం తన ఆహారాన్ని తింటుండగా దాని దగ్గరికి వెళ్లి తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు.

వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో సింహాన్ని రికార్డు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ వ్యక్తిని గమనించిన సింహం.. బిగ్గరగా గర్జిస్తూ అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అతడు భయపడి పారిపోకపోవడంతో అది వెనక్కి తగ్గింది. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఘటనకు సంబంధించిన దృశ్యాలను దూరంగా ఉండి వ్యక్తి స్నేహితులే చిత్రీకరించడం గమనార్హం. ఆహారం తింటున్న సమయంలో ఆ వ్యక్తి దగ్గరగా రావడం వల్లే సింహానికి కోపం వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వీడియోలో వినిపిస్తున్న శబ్దాల ద్వారా అక్కడ చాలామంది పురుషులు ఉన్నారని అర్థమవుతోంది. అదృష్టవశాత్తు ఎటువంటి అపశృతి జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

నెటిజన్లు ఫైర్..
తాజా వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం తింటూ తన పనిలో తాను ఉన్న సింహాన్ని రెచ్చగొట్టడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సింహం సదరు వ్యక్తిపై దాడి చేసి ఉంటే.. ప్రజలు దానిపై దాడి చేసి చంపి ఉండేవారని కామెంట్స్ చేస్తున్నారు. ‘సింహానికి ఆకలిగా లేనట్లుంది’ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. లేదంటే లంచ్ తో పాటు నైట్ డిన్నర్ కూడా చేసేదని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తంగా ఆ వ్యక్తి చేసిన పని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.

Also Read: Meenakshi Natarajan: ఢిల్లీ వెళ్లిన మీనాక్షి నటరాజన్.. బీసీ నేతలతో రైలు ప్రయాణం

పాక్‌లో సింహం ఘటన
ఇటీవల లాహోర్‌లోని ఒక నివాస ఫార్మ్‌హౌస్‌లో పెంచుకుంటున్న 11 నెలల సింహం.. గోడ దూకి బయటకు పారిపోయి బీభత్సం సృష్టించింది. ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేపింది. ఒక సీసీటీవీ వీడియోలో సింహం గోడ దూకి మహిళ, పిల్లల వెంట పరిగెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Also Read This: Guvvala Balaraju: గులాబీని ఖాళీ చేసేలా కమలం స్కెచ్.. లోకల్‌‌‌‌కు ముందే దెబ్బకొటేలా ప్లాన్

Also Read This: CM Revanth Reddy: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..

Just In

01

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..

Viral Video: రైల్వే స్టేషన్స్‌లో నీళ్లు తాగుతున్నారా? ఇది చూస్తే ఎప్పటికీ ఆ ధైర్యం చేయరు!

New Liquor Shops: గద్వాల జిల్లాలో లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ సంతోష్

People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఈ సారి భయపెట్టడానికి రెడీ..

Lions In Beach: ఆడ సింహాల ఒత్తిడి.. ఫ్యామిలీతో బీచ్‌లకు వెళ్తోన్న మగ సింహాలు.. ఇదేందయ్యా ఇది!