Delhi-Husband-Case
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: పక్కా ప్లాన్‌తో భర్తను చంపించింది… ఎలా దొరికిపోయిందంటే?

Viral News: భర్తను అంతమొందించిన మరో భార్య క్రిమినల్ కథ వెలుగుచూసింది. డ్రగ్స్ మత్తులో ప్రతిరోజూ హింసిస్తున్న, నేరచరిత్ర ఉన్న భర్తపై విసిగిపోయిన ఓ మహిళ హత్యకు పాల్పడింది. పక్కా ప్లాన్ వేసి సుపారీ ఇచ్చిన మరీ భర్తను హత్య చేయించింది. తన ప్రియుడితో నూతన జీవితం ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేసుకుంది. కానీ, హత్యకు గురైన భర్త మొబైల్ ఫోన్, ప్రియుడు చేసిన ఓ తప్పు… హత్య ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. ఢిల్లీకి చెందిన వ్యక్తి హర్యానాలో హత్యకు గురైన కేసుకు సంబంధించిన వివరాలు (Viral News) ఈ విధంగా ఉన్నాయి.

పలు నేరాలకు పాల్పడడంతో నేరస్తుడిగా గుర్తింపు పొందిన ప్రీతమ్ ప్రకాశ్‌ అనే వ్యక్తి మిస్సింగ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు షాకింగ్ విషయాలు కనుగొన్నారు. ప్రీతమ్ ప్రకాశ్‌ను అతడి భార్య సోనియా సుపారీ ఇచ్చి మరీ చంపించిందని తేల్చారు. ప్రియుడితో నూతన జీవితాన్ని మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడ్డట్టు గుర్తించారు. ప్రస్తుతం సోనియా, ఆమె ప్రియుడు రోహిత్‌ ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు.

అసలు ఎలా మొదలైంది?

ప్రీతమ్‌ డ్రగ్స్‌‌కు బానిసయ్యాడు. అక్రమ ఆయుధాలు, దొంగతనాలు, కిడ్నాప్ వంటి అనేక నేరాల్లో ప్రమేయం ఉందని సోనియా చెప్పింది. తన భర్తను డ్రగ్స్, నేరాల నుంచి బయటపడేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రీతమ్ మత్తులో ఇంటికి వచ్చి అనేకసార్లు తనను చిత్రహింసలకు గురిచేశాడని దర్యాప్తులో అంగీకరించింది. అయితే, 2023లో ఒక సోషల్ మీడియాలో రోహిత్ అనే క్యాబ్ డ్రైవర్‌తో పరిచయమయ్యిందని సోనియా తెలిపింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, ప్రీతమ్ అడ్డుగా ఉన్నాడని భావించారు. తాను కొత్త జీవితం మొదలుపెట్టాలంటే ప్రీతమ్ చనిపోవాల్సిందేనని సోనియా భావించింది. రోహిత్‌కి కూడా నేరపూరిత నేపథ్యం ఉండడంతో సులభంగా హత్య చేయవచ్చునని భావించింది.

సుపారీ చర్చలు
అయితే, రోహిత్ ఒక హత్య కేసు సహా నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీ–సోనిపట్ మార్గంలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో, తాను మరో నేరానికి పాల్పడలేనని రోహిత్ చెప్పాడు. రూ.6 లక్షలు ఇస్తే ఎవరో ఒక హంతకుడిని చూసిపెడతానని రోహిత్ సలహా ఇచ్చాడు. అయితే, తన వద్ద అంత డబ్బు లేదని సోనియా చెప్పింది. దాంతో, ఇద్దరి మధ్య హత్య చర్చలు అక్కడితో ఆగిపోయాయి. గతేడాది జులై 2న ప్రీతమ్‌తో గొడవపడి సోనియా హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న తన సోదరి దీపా ఇంటికి వెళ్లింది. సోనియాను రోహిత్ కారులో అక్కడికి తీసుకెళ్లి దించి వచ్చాడు.

ప్లాన్ ‘బీ’ చేసిందిలా…

తన సోదరి ఇంటికి వెళ్లిన సోనియాను తిరిగి ఢిల్లీ తీసుకెళ్లేందుకు 2023 జులై 5న ప్రీతమ్ సోనిపట్‌ వెళ్లాడు. అక్కడ కూడా ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ప్రీతమ్‌ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డు తొలగించుకోవాలని భావించుకున్న సోనియా.. తన సోదరి యొక్క బావమరిది విజయ్‌ని సంప్రదించింది. ఒక లక్ష రూపాయలు ఇస్తే ప్రీతమ్‌ను హత్య చేస్తానంటూ విజయ్ అడిగాడు. , అంత ఇవ్వలేనని, కేవలం రూ.50,000 మాత్రమే ఇవ్వగలనని సోనియా చెప్పింది. చివరికి రూ.50 వేలకు సుపారీ డీల్ కుదిరింది. డీల్ కుదిరిన రోజే ఇంటికి వెళ్దామంటూ సోనియాను ప్రీతమ్ కోరారు. తిరస్కరించిన సోనియా ఆ రాత్రి తన సోదరి ఇంట్లోనే ఉండాలని, మరుసటి రోజు వెళ్దామంటూ నమ్మించింది. ఈ సమాచారాన్ని విజయ్‌కు అందించింది. ఆ రాత్రే ప్రీతమ్‌ను చంపేయాలని కోరింది. పథకం ప్రకారం, ప్రీతమ్, విజయ్ ఇంట్లో నిద్రపోయారు. సోనియా సహా మిగతా వారంతా టెరస్‌పై (బిల్డింగ్ పైన) నిద్రపోయారు. విజయ్ అర్ధరాత్రి సమయంలో ప్రీతమ్‌ను హత్య చేసి, అతడి డెడ్‌బాడీని ఇంటికి సమీపంలోనే ఉన్న ఓ డ్రైనేజీలో పడేశాడు.

Read Also- Shibu Soren: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం

మిస్టేక్ ఇదే…

అయితే, ప్రీతమ్ ఫోన్‌ ఆ గదిలోనే ఉండిపోయింది. సోనియా ఆ ఫోన్‌ను తన దగ్గరే పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ డ్రైనేజీ ప్రీతమ్ శవాన్ని గుర్తించారు. అయితే, శవాన్ని గుర్తించలేకపోయారు. ఇక, సోనియా తెలివిగా తన భర్త కనిపించడం లేదంటూ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో భర్త ఫోన్‌ను ప్రియుడు రోహిత్‌కు ఇచ్చింది. దానిని పగలకొట్టాలని కోరింది. కానీ, రోహిత్ ఆ ఫోన్‌ను పగలగొట్టకుండా వాడాడు. దీంతో, ప్రీతమ్ ఆచూకీ కోసం అన్వేషణ మొదలుపెట్టిన పోలీసులు ఫోన్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోహిత్ వద్ద ఉన్నట్టు గుర్తించారు. అతడిని పిలిచి ప్రశ్నించగా తొలుత కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, చివరకు నేరాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత సోనియాను కూడా పిలిచి ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

కాగా, సోనియా ప్రస్తుత వయసు 34 ఏళ్లు కాగా, మృతుడు ప్రీతమ్‌ వయసు 42 సంవత్సరాలు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సోనియాకు వివాహం అయింది. తన కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ఆమె ప్రీతమ్‌ను పెళ్లి చేసుకుంది. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఢిల్లీలోని ఆలీపూర్‌లో నివాసం ఉండేవారు.

Read Also- Health Tips: 30 మ్యాజిక్ టిప్స్.. మీకు తెలియకుండానే రోజుకు 10,000 స్టెప్స్ నడిచేస్తారు!

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!