Khammam (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam: ఈ వాహనం నేర పరిశోధనలో చాలా ముఖ్యం: కమిషనర్ సునీల్ దత్

Khammam: నేర పరిశోధనలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఓరేటరీ మొబైల్ ల్యాబ్ చాలా ముఖ్యమైందని ఖమ్మం(Khammam) పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Sunil Dutt) పేర్కొన్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నేర పరిశోధనలో కీలకంగా ఉపయోగపడే ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్(Mobile Lab Van) పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి తక్షణమే పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ వాహనం పూర్తి సదుపాయాలతో కూడిన మొబైల్ ల్యాబ్‌‌గా పని చేస్తుందని అన్నారు. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి ఆయా ప్రదేశంలో లభించిన అన్ని రకాల సాక్షాలను (ఫింగర్ ప్రింట్స్, రక్తపు నమూనాలు, ఇతర ఆధారాలు) సేకరించి ప్రాథమిక విశ్లేషణలు చేసే ఈ వాహనం నేర పరిశోధనలో కీలకంగా మారుతుందన్నారు.

నేరం కాలయాపన కాకుండా
అంతేకాకుండా నేరం జరిగిన సమయంలో కాలయాపన కాకుండా వెంటనే వివిధ రకాల సాక్షాదారాల(Evidence)ను సేకరించేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పోలీసు అధికారులకు సైతం సమయపాలన పాటించే విధంగా ఈ వాహనం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి సుశీల్ సింగ్(Sushil Singh), డాక్టర్ వి. నాగలక్ష్మి(Nagalaxmi) (శాస్త్రీయ అధికారి), కే.సుధాకర్(శాస్త్రీయ అధికారి), కె. నరసింహ (అసిస్టెంట్ డైరెక్టర్), ఆర్ ఐ. కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగుల్ మీరా పాల్గొన్నారు.

Also Read: MLAs Disqualification Case: బీఆర్ఎస్ అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి

పోలీస్ స్టేషన్ సందర్శించిన కమిషనర్
అంతకుముందు ఖమ్మం(Khammam) త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Sunil Dutt) సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, సిసిటిఎన్ఎస్ అప్లోడ్, జనరల్ డైరీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, డయల్ హండ్రెడ్ కాల్స్(100) ప్రతిస్పందన సమయం, సస్పెక్ట్ షీట్స్, పెండింగ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసులను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్(Special drive) లను నిర్వహించాలన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సెక్టర్ ఆఫీసర్ల బాధ్యతలు విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్9Petro Car), బీట్ డ్యూటీ(Beet Duty) సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలన్నారు. పాత నేరస్తుల నివాసాలను కనిపెడుతూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.

Also Read: Drunk and Drive: ప్రమాదాల నివారణే లక్ష్యం.. దొరికితే లైసెన్స్ రద్దుకు సిఫార్సు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు