Dharmasthala Case (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఆసక్తికర పరిణామం.. ప్రత్యక్ష సాక్షికి సిట్ కీలక ఆదేశాలు!

Dharmasthala Case: కర్ణాటకలోని ధర్మస్థలలో(Dharmasthala ) సంచలనం సృష్టించిన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీనేజ్ యువతిని పూడ్చిపెట్టడాన్ని చూశానని చెప్పిన వ్యక్తికి ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team – SIT) కీలక సూచనలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు స్టేషన్ లో అధికారిక ఫిర్యాదు నమోదు చేయాలని కోరింది. ఎందుకంటే కేసు నమోదు అయిన తర్వాత మాత్రమే దర్యాప్తు ప్రారంభం అవుతుందని సిట్ స్పష్టం చేసింది.

సిట్ అధికారి ఏమన్నారంటే?
ధర్మస్థల కేసు ప్రత్యక్ష సాక్షి, సామాజిక కార్యకర్త అయిన జయంత్ (48) ఆదివారం సిట్ అధికారులను కలిశారు. టీనేజ్ యువతి ఖననం గురించి వారి ఎదుట ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అధికారికంగా ఫిర్యాదు చేయాలని సిట్ అధికారులు జయంత్ కు సూచించారు. ఫిర్యాదు అనంతరం సోమవారం తిరిగి రావాలని జయంత్ ను కోరారు. ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘సిట్ పోలీస్‌ స్టేషన్ కాదు. మేము నేరుగా ఫిర్యాదులు స్వీకరించలేము. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా మేము దర్యాప్తు చేపట్టి వాంగ్మూలాలు నమోదు చేస్తాము’ అని తెలిపారు.

‘అమ్మాయి శవం పూడ్చడం చూశా’
ఇదిలా ఉంటే ప్రత్యక్ష సాక్షి జయంత్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆ అమ్మాయి శవాన్ని నేను చూశాను. చట్టబద్ధమైన పద్ధతులు పాటించకుండా పూడ్చేశారు. ఆమె శవాన్ని పూడ్చిన ప్రదేశం నాకు తెలుసు. ఆ అమ్మాయిని హత్య చేశారా? లేదా? అనేది నాకు తెలియదు. కానీ శవం కొంత పాడైపోయిన స్థితిలో ఉంది’ అని తెలిపారు. ఆ పూడ్చివేత 15 ఏళ్ల క్రితం జరిగిందని భయంతో చాలా మంది ఇంతకాలం మౌనం వహించారని ఆయన ఆరోపించారు. ‘రానున్న రోజుల్లో మరికొందరు కూడా ఇలాంటి షాకింగ్ అనుభవాలను సిట్ ముందు వెల్లడిస్తారు’ అని జయంత్ చెప్పారు.

‘ఇప్పటివరకూ న్యాయం జరగలేదు’
స్థానిక న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ జయంత్ మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 1986 డిసెంబరులో అదృశ్యమైన పద్మలత అనే మహిళ శవం దాదాపు రెండు నెలల తర్వాత లభించింది. ఆమె నాకు బంధువు. పద్మలత హత్య కేసులో మాకు ఇప్పటివరకూ న్యాయం లభించలేదు. అందువల్ల ఈ వ్యవస్థపై మాకు నమ్మకం తగ్గింది. ఇప్పుడు పాత కేసును SIT దర్యాప్తు చేస్తుండటంతో మాకు తిరిగి నమ్మకం వచ్చింది. కాబట్టి నేను ఫిర్యాదు చేస్తున్నాను. ఆ అమ్మాయిని పూడ్చిన ఘటనకు నేను సాక్షిని’ అని అన్నారు.

‘నా చేత శవాలు పాతిపెట్టించారు’
మరోవైపు ధర్మస్థల మాజీ శానిటేషన్ కార్మికుడు మాట్లాడుతూ అనేక శవాలను పూడ్చాలని తనను బలవంతం చేశారని అన్నారు. మృతుల్లోని కొందరు మహిళలు, బాలికలు లైంగిక వేధింపులకు గురై ఉండవచ్చని అతడు ఆరోపించారు. ప్రస్తుతం ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. సాక్షుల ప్రకారం.. శవాలను పూడ్చినట్లుగా భావిస్తున్న 8 ప్రదేశాలను పోలీసు అధికారులు గుర్తించారు. ఒక ప్రదేశంలో ఎముకల అవశేషాలు బయటపడటం సాక్షుల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. మిగతా ఐదు ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి.

Also Read: Excise Raids: బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్​ ఉద్యోగుల అరెస్ట్

హెల్ప్ లైన్ నెంబర్ విడుదల
ఇదిలా ఉంటే మరింత మంది సాక్షుల నుంచి సమాచారం సేకరించేందుకు దర్యాప్తు సంస్థ సిట్ పబ్లిక్ హెల్ప్ లైన్ నెంబర్ ను విడుదల చేసింది. ‘ధర్మస్థల కేసుకు సంబంధించి ఏదైనా సమాచారం 0824 2005301 నంబర్‌కు కాల్‌ చేయవచ్చు లేదా 8277986369 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా సమాచారం పంపవచ్చు’ అని స్థానికులకు సూచించింది. మరోవైపు అదృశ్యమైన MBBS విద్యార్థిని అనన్య భట్ తల్లి సుజాతా భట్ తరపున న్యాయవాది సిట్ కు కీలక సూచనలు చేశారు. పూడ్చివేత ప్రదేశాలను గుర్తించేందుకు గ్రౌండ్‌ పెనెట్రేటింగ్ రాడార్‌ (GPR) వాడాలని కోరారు. ‘ప్రత్యక్ష సాక్షి 2014 నుంచి ధర్మస్థలలో ఉండటం లేదు. అడవి భూభాగం కాలక్రమంలో మారిపోయి ఉండొచ్చు. సాక్షి గుర్తు పట్టే భౌగోళిక గుర్తులు మారిపోయి ఉండే అవకాశం ఉంది’ అని న్యాయవాది ఎన్. మంజునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Just In

01

Kadiyam Srihari: ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు.. కడియం శ్రీహరి కీలక వాఖ్యలు

Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!

Khammam: ఖమ్మం జిల్లాలో శ్రీ కోటమైసమ్మ తల్లి అతి పెద్ద జాతర.. ఈ విశిష్టత కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..