Viral News: వివాహేతర సంబంధాలు (Extramarital affairs) ఎన్నో కుటుంబాలను చిదిమేస్తున్నాయి. జీవితాలను ధ్వంసం చేసే స్థితికి తీసుకువెళ్తున్నాయి. ఆత్మహత్యలు, హత్యలు వంటి విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. అలాంటి విషాదకర మరోకటి వెలుగులోకి (Viral News) వచ్చింది. తన భార్యకు పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. 7, 2 ఏళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసింది. మృతుడిని అల్పేశ్ కాంతిభాయ్ సోలంకీగా గుర్తించారు. సూరత్ నగరంలోని డిండోలి అనే ఏరియాలోని ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య ఫాల్గునీభాయ్, జిల్లా పంచాయితీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తోంది. భర్త అల్పేశ్ భాయ్ సోలంకీకి భార్య ఫాల్గునీభాయ్ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె హుటాహుటిన ఇంటికి వెళ్లింది. ఇంటి తలుపులు మూసి ఉండడంతో, వెంటనే బంధువులకు ఫోన్ చేసింది. బంధువులు వచ్చిన వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఇద్దరు చిన్నపిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. వారి పక్కనే అల్పేశ్ భాయ్ మృతదేహం కూడా ఉందని సూరత్ డీసీపీ విజయ్ సింగ్ గుర్జర్ వెల్లడించారు.
Read Also- Sai Rajesh: ‘బేబి’కి నేషనల్ అవార్డ్స్.. నన్ను ఎవరూ నమ్మని రోజు ఆయన నమ్మాడంటూ డైరెక్టర్ ఎమోషనల్!
మృతుడి మొబైల్‌లో ఉన్న కొన్ని వీడియోలతో పాటు, చనిపోవడానికి ముందు అతడు రాసిన నోట్, రెండు డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడు అల్పేశ్ భాయ్ సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఫాల్గునీభాయ్‌కి నరేష్ కుమార్ రాథోడ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘‘భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసిన దగ్గర నుంచి అల్పేశ్ భాయ్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతూ వచ్చాడు. చివరకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని అల్పేశ్ సోదరుడు పోలీసులకు తెలిపాడు.
Read Also- Tribanadhari Barbarik: ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ఉదయ భాను ఊర మాస్ సాంగ్
అల్పేశ్ గత 1-2 నెలలుగా డైరీలో అన్ని వివరాలు రాస్తున్నాడని పోలీసులు తెలిపారు. ‘‘ దర్యాప్తులో భాగంగా రెండు డైరీలను స్వాధీనం చేసుకున్నాం. అతడు రాసిన నోట్ మొత్తం 5-6 పేజీలు ఉంది. తల్లిదండ్రులు, భార్యను నోట్ రాశాడు. భార్యకు అఫైర్ ఉందన్న విషయం తెలిసిన దగ్గర నుంచి నేను తీవ్రంగా కుంగిపోయానంటూ వాపోయాడు’’ అని ఒక పోలీసు అధికారి చెప్పారు. రెండు డైరీలు స్వాధీనం చేసుకోగా, ఒకటి భార్యను ఉద్దేశించి ప్రత్యేకంగా రశాడని, అందులో అన్ని వివరాలు ఉన్నాయని వివరించారు. వివాహేతర సంబంధ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తమ దృష్టికి వచ్చినట్టు పోలీసులు వివరించారు. ఈ కేసులో నిందిత భార్య, ఆమె ప్రియుడి అరెస్ట్ చేశామని తెలిపారు.
Read Also- Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ చూసి సుకుమార్ ఫోన్ చేశారు.. అప్పుడు సంతోషించా!