Medak Town (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Medak Town: ఆలయ విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. రహదారిపై రాస్తా రోకో!

Medak Town: మెదక్ పట్టణంలో 58 ఏండ్లుగా దినదినాభివృద్ధి చెందిన కోదండ రామాలయం(Kodanda Rama Temple) ను దేవాదాయ శాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం ఆలయ రికార్డులు, హుండీ, షాపింగ్ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకొనేందుకు దేవాదాయ శాఖ అధికారులు కోదండ రామాలయంకు చేరుకున్నారు. హుండీ నీ, షాపింగ్ కాంప్లెక్స్‌ను దేవాదాయ శాఖ అధికారుల సీజ్ చేశారు. అయతే దేవాలయ ఇతర రికార్డులను స్వాధీనం చేసుకునే క్రమంలో మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి(Padmadevender Reddy) ఆధ్వర్యంలో రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనంను చేయవద్దంటూ తెలిపారు.

విలీనం ప్రక్రియా వాయిదా
ఆలయ కమిటీ సభ్యులు, అఖిల పక్షం నాయకులు ఆలయం ముందు ధర్నా చేశారు. మరియు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆలయం దేవాదాయ శాఖలో విలీనం ప్రక్రియా వాయిదా పడింది. అనంతరం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 58 ఏళ్ల రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం అన్యాయమని ఇది భక్తుల నమ్మకాన్ని ప్రభుత్వం అమ్ము చేయడమేనని ఆమే విమర్శించారు.

Also Read: Nagarjuna Sagar: నాగార్జునసాగర్ తెలంగాణకు అప్పగిస్తూ కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

నిరసన వ్యక్తం
ఈ సందర్భంగా పట్టణ సి ఐ మహేష్(CI Mahesh)కి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(Padmadevender Reddy)కి మధ్య వాగివాదం జరిగింది. బారీ ఎత్తున పోలీసులను మోహరించి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నీ,అఖిల పక్షం నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మామిండ్ల ఆంజనేయులు,ఆలయ కమిటీ సభ్యులు,చైర్మన్ బండ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!