Satyavati Rathod (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Satyavati Rathod: గురుకుల పాఠశాలలో దారుణం.. కారంతో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్!

Satyavati Rathod: మహబూబాబాద్ గురుకుల పాఠశాలలోని పిల్లలకు కారంతో బ్రేక్ ఫాస్ట్ పెట్టడం ఏంటని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavati Rathod) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా(Mehabubabad) కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల(Tribal Welfare Girls’ Gurukul School)లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి సందర్శించారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఏదో ఒక చోట గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆసుపత్రుల పాలైన వార్తలు చూడవలసిన దుస్థితి వస్తుందని మాజీ మంత్రి ఆరోపించారు.

విద్యార్థుల గురించి పట్టించుకోరా?
అయినప్పటికీ ప్రభుత్వ పాలనలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని మండిపడ్డారు. హాస్టల్లో ముద్దలు అన్నం తినలేక ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లారని చెప్పారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా ఏడిపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నదని విమర్శించారు. గురుకుల విద్యార్థుల గురించి పట్టించుకోరా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. భావి భారత పౌరులైన ఈ విద్యార్థుల భవిష్యత్తు పైన మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఇదేనా? అని నిలదీశారు. అనేకమంది గురుకుల విద్యార్థులు చనిపోతున్న మీ గుండె కరగడం లేదా ముఖ్యమంత్రి అంటూ గుర్తు చేశారు.

Also Read: Fake Pensions: అక్రమ పింఛన్లకు చెక్.. ఇకపై అలా కుదరదు!

ఇంటిగ్రేటెడ్ స్కూలు కడతామని
గురుకులాలను ప్రభుత్వం ఆగం చేశారని, ఇంటిగ్రేటెడ్ స్కూలు కడతామని డబ్బా కొట్టిన ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఒక ఇటుక పెట్టింది లేదని ప్రభుత్వాన్ని విమర్షించారు. ఒక స్కూలు కట్టింది లేదని అన్నారు. 284 గా ఉన్న గురుకులాలను కెసిఆర్(KCR) 1023 గురుకులాలను పెంచిన ఘనత సాధించారన్నారు. ఒక లక్ష 60000 మంది ఉన్న గురుకులాల్లో కేసీఆర్(KCR) ఆరు లక్షల మంది విద్యార్థులు చదివే సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. పనిమంతుడు పందిరిస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట అనే సామెత ప్రభుత్వానికి వర్తిస్తుందన్నారు. కెసిఆర్ ఆనవాళ్లు మారుస్తా అంటే ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఆడవాళ్లు మార్చడం అంటే విద్యార్థులు గురుకులం నుండి టీసీలు తీసుకొని వెళ్లిపోవడమా..? అని దుయ్యబట్టారు. కలాశాలలో పలువురు విద్యార్థులు వారి సమస్యలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తెలియచేశారు.

Also Read: Komatireddy: రాష్ట్రానికే ఆదర్శంగా నల్గగొండ ఇంటిగ్రేటెడ్ స్కూల్

Just In

01

Ramachandra Rao: రాష్ట్రంలో ఫ్రీ బస్సు వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి: రాంచందర్ రావు

Kishan Reddy: రాష్ట్రాభివృద్ధిపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?.. కిషన్ రెడ్డి సవాల్

TET Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారంలో టెట్ నోటిఫికేషన్.!

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’