Meenakshi Natrajan: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హమీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కొనసాగుతుందని ఏఐసీసీ(AICC) రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) అన్నారు. అందోలు నియోజకవర్గంలో చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా హనుమాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) అధ్యక్షత వహించారు.
ఆమె మాట్లాడుతూ లోకసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కోరుకున్న మోడల్ రాష్ట్రంగా తెలంగాణ(Telanagan) అభివృద్ది చెందుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం హిందుత్వ వాదంతో ఓట్లను సంపాదిస్తుందన్నారు. కేంద్రం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీహార్(Bhiar)లో పేదల ఓట్లు తొలగిస్తున్నారని, మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీ కోసమే పనిచేస్తుందన్నారు.
గెలిచినా ఓడినా ప్రజల మద్యనే
సామాజిక న్యాయం దిశగా కాంగ్రేస్(Congress) ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం కల్పించిందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ(Min Damodar Rajanarsimha) మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత సోనియా గాంధీ(Gandhi)పై నమ్మకంతో కాంగ్రేస్(Congress) ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించారు.
Also Read: School Bus: బడి బస్సులు భద్రమేనా.. రవాణా శాఖ ఏం చేస్తున్నట్టు?
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్య సహయం అందేలా రూ.10 లక్షలకు పెంచామన్నారు. గెలిచినా ఓడినా ప్రజల మద్యనే ఉన్నామన్నారు. రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) మాట్లాడుతూ తాము చేపట్టిన పనులు ప్రజలకు వివరించేందుకు తాము ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమకు ప్రభుత్వాన్ని అప్పగించిందని బీఆర్‌ఎస్(BRS) పార్టీని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పాదయాత్రలను నిర్వహించిన పార్టీ కాంగ్రేస్ అని అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
9 రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సహయాన్ని అందించి రైతుల ఇళ్లల్లో పండగ వాతావరణం కల్పించింది కాంగ్రేస్ ప్రభుత్వమేనని అన్నారు. సన్న వడ్లకు రైతులకు బోనస్ అందించామని, రేషన్‌కార్డుల(Ration cards)ను పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Lections) బీఆర్‌ఎస్(BRS) పార్టీకి తగిన బుద్ది చెప్పాలన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పీసీసీ నాయకులు గిరిజా షెట్కార్, సంగమేశ్వర్, రాజనర్సింహ ఫౌండేషన్ చైర్మన్ త్రిష రాజనర్సింహ, పటాన్‌చెరువు, నర్సాపూర్ నియోజకవర్గాల కాంగ్రేస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, రావుల అంజిరెడ్డి, మెదక్ కాంగ్రేస్ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Also Read: KCR Meetings: భవిష్యత్తు కనపడుతోందా.. బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్