Lungs Harmful Habits (Image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

Lungs Harmful Habits: ఈ 6 అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీ ఊరిపితిత్తులు ఢమాలే!

Lungs Harmful Habits: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ వల్ల కలిగే మరణాల్లో అగ్రస్థానంలో ఉంది. స్త్రీ, పురుషులు అనే తారతమ్యం లేకుండా అత్యధిక మరణాలకు ఇది కారణమవుతోంది. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ధూమపానం ప్రధాన కారణం. సుమారు 85 శాతం కేసులకు సిగరేట్ తాగే అలవాటే కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ధూమపానం చేయకపోవడం ఊరితిత్తుల క్యాన్సర్ నివారణకు ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు.

అయితే సిగరేట్ అలవాటు మానుకోవడం లేదా తాగే అలవాటు లేకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదని చాలా మందిలో ఓ అభిప్రాయం ఉంది. అయితే అది నిజం కాదని రాజస్థాన్ జైపూర్‌లోని అమర్ జైన్ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ శివాని స్వామి అన్నారు. ‘మీ ఊపిరితిత్తులను కాపాడుకోవడం అంటే కేవలం ధూమపానం చేయకపోవడం మాత్రమే కాదు. మీరు ఎక్కడ ఉన్నారు. మీ శరీర ధారణ (posture), మీ జీవనశైలి అన్నీ కూడా ముఖ్యమే’ అని పేర్కొన్నారు.

ప్రతిరోజు శ్వాస వ్యాయామాలు, వాకింగ్, ద్రవ పదార్థాలు తీసుకోవడం, కాలుష్యాల నుండి దూరంగా ఉండటం వంటి సులభమైన అలవాట్లు.. ఊపిరితిత్తులను బలపరుస్తాయని డాక్టర్ శివాని స్వామి అన్నారు. అదేవిధంగా రోజువారి జీవితంలో తెలియకుండానే చేసే.. ఊపిరితిత్తుల పనితీరును క్రమంగా దెబ్బతీయగల 6 హానికరమైన అలవాట్లను వివరించారు.

1. పరోక్ష ధూమపానం (Secondhand smoking)
డాక్టర్ శివాని స్వామి మాట్లాడుతూ ‘మీరు ధూమపానం చేయకపోయినా ధూమపానం చేసే వారి దగ్గర ఉండటం లేదా హూక్కా, అగరబత్తి వంటి వాటి పొగను పీల్చడం అంతే ప్రమాదకరం. దీర్ఘకాలంపాటు పరోక్ష ధూమపానానికి గురి కావడం ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది’ అని తెలిపారు.

2. కదలికలు లేకుండా ఉండే జీవనశైలి (Sedentary lifestyle)
‘కదలికలు లేని జీవనశైలి కేవలం బరువుకి లేదా హృదయానికి మాత్రమే కాదు ఊపిరితిత్తుల సామర్థ్యాన్నీ తగ్గిస్తుంది. పద్ధతి ప్రకారం వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు మరింత సమర్థవంతంగా పని చేస్తాయి’ డాక్టర్ శివాని స్వామి అని చెప్పారు.

3. శరీర ధారణలో లోపాలు (Posture issues)
‘కుర్చీలో వంగి కూర్చోవడం, సోఫాపై వాలిపోవడం వంటి అలవాట్లు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెంచి వాటి విస్తరణ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి’ అని ఆమె చెప్పారు.

4. దగ్గును ఆపుకోవడం (Stifling your cough)
‘కొందరు అప్పుడప్పుడు దగ్గును అణిచివేస్తుంటారు. నలుగురిలో ఉన్నప్పుడు ఇది మర్యాదపూర్వకమైందిగా అనిపించవచ్చు. కానీ దీన్ని అలవాటుగా మార్చుకుంటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ లేదా ఇతర ఇరిటెంట్లు బయటకు రావు’ అని చెప్పారు.

5. తగినంత నీరు తాగకపోవడం (Lack of adequate water intake)
‘హైడ్రేషన్.. ఊపిరితిత్తుల మ్యూకోసల్ లైనింగ్‌ను రక్షణాత్మకంగా ఉంచుతుంది. నీటి లోపం వల్ల మ్యూకస్ దట్టమై ఇరిటెంట్లు బయటకు వెళ్లకపోవడం, బాక్టీరియా, వైరస్‌లకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది’ అని వివరించారు.

Also Read: Viral Video: రోబోకు సుస్సు అర్జెంట్ అనుకుంటా.. ఎలా పరిగెడుతోందో చూడండి!

6. రసాయనాల వినియోగం (Excessive use of chemical-laden products)
‘క్లీనింగ్ ప్రాడక్ట్స్, డిసింఫెక్టెంట్లు, ఎయిర్ ఫ్రెషెనర్లు, సువాసన కొవ్వొత్తులు ఇవన్నీ వాసన బాగున్నా.. వోలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ (VOCs) కలిగి ఉంటాయి. వీటిని రోజు పీలిస్తే దీర్ఘకాలంలో శ్వాసనాళాలు ఇరిటేషన్ కు గురవుతాయి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది’ అని చెప్పారు.

Also Read This: Mobiles Under Rs 10000: రూ.10వేల బడ్జెట్‌లో తోపు స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

గమనిక: ఈ సమాచారం మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?