Microsoft On AI: ప్రస్తుత ఏఐ రంగంలో చాలా వరకూ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. మనిషి చేసే పనిని అత్యంత కచ్చితత్వంలో త్వరితగతిన ఏఐ చేస్తుండటంతో పలు అంతర్జాతీయ కంపెనీలు కృత్రిమ మేధ వినియోగంపై దృష్టిసారిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏఐ మరింత విస్తృతంగా అభివృద్ధి చెందితే.. మన ఉద్యోగాలు గల్లంతేనన్న అభిప్రాయాలు ప్రస్తుతం చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఏఐ వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగాలపై అధ్యయనం చేసింది. భవిష్యత్తులో 40 రకాల ఉద్యోగాలకు ఏఐ వల్ల ముప్పు ఉన్నట్లు తేల్చింది.
వారి ఉద్యోగాలు ఔట్!
మైక్రోసాఫ్ట్ అధ్యయనం ప్రకారం.. ఏఐ కారణంగా భవిష్యత్తులో 40 రకాల వృత్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఏఐ కారణంగా ట్రాన్స్ లేటర్లు, టికెట్ ఏజెంట్లు, ట్రావెల్ క్లర్క్‌లు, బ్రాడ్‌కాస్ట్ అనౌన్సర్లు. రేడియో డీజేలు, బ్రోకరేజ్ క్లర్క్‌లు, చరిత్రకారులు, ప్యాసింజర్ అటెండెంట్లు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, రచయితలు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సీఎన్సీ టూల్ ప్రోగ్రామర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు, ఫార్మ్ , హోమ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేటర్లు, టెలిమార్కెటర్లు, కన్సీర్జెస్, రాజకీయ విశ్లేషకుల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని మైక్రోసాఫ్ట్ అధ్యయనం అంచనా వేసింది.
జర్నలిస్టులు సైతం..!
ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారిలో జర్నలిస్టులు సైతం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ నివేదిక వెల్లడించింది. రిపోర్టర్లు, జర్నలిస్టులు, ఎడిటర్ల జాబ్స్ ప్రమాదంలో పడవచ్చని అభిప్రాయపడింది. అలాగే గణిత శాస్త్రవేత్తలు, ప్రూఫ్ రీడర్లు, వ్యాపార సలహాదారులు, పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్టులు, ప్రకటనల అమ్మకాల ఏజెంట్లుడేటా సైంటిస్టులు, వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు, వెబ్ డెవలపర్లు, మేనేజ్మెంట్ విశ్లేషకులు తదితర రంగాల వారు ఏఐ వల్ల ముప్పు ఎదుర్కొనవచ్చని చెప్పింది.
Also Read: Yuzvendra Chahal: స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సూసైడ్? వెలుగులోకి నమ్మలేని నిజాలు
వీరి ఉద్యోగాలు సేఫ్!
అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఏఐ వల్ల ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని మైక్రోసాఫ్ట్ అధ్యయనం అభిప్రాయపడింది. నర్సింగ్ అసిస్టెంట్లు, ప్రమాదకర పదార్థాల తొలగింపు కార్మికులు, పెయింటర్లు, ప్లాస్టర్లు, షిప్ ఇంజనీర్లు, టైర్ రిపేర్లు, ఛేంజర్లు, హైవే మెయింటెనెన్స్ వర్కర్లు, డిష్‌వాషర్లు, సిమెంట్ మేసన్లు, కాంక్రీట్ వర్కర్లు, స్టోడాంటిస్టులు, సిస్టమ్ ఆపరేటర్లు తదితర 40 రకాల జాబ్స్ వారికి ఏఐ వల్ల ప్రమాదం ఉండకపోవచ్చని మైక్రోసాఫ్ట్ నివేదిక వివరించింది.