MLC Addanki Dayakar: ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు ప్రశ్నించలేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్‌కు సుప్రీంకోర్టు(Supreme Court)కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చిందన్నారు. సభా హక్కులను కాపాడేది కేవలం స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు(Supreme Court)తేల్చిందన్నారు. కానీ, తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారన్నారు.
Also Read:Telangana High Court: హైకోర్టులో నలుగురు ప్రమాణ స్వీకారం
రాజ్యాంగ వ్యతిరేక శక్తి బీఆర్ఎస్
బీఆర్ఎస్(BRS) నాయకులు ముందు సుప్రీంకోర్టు తీర్పును చదువుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పార్టీలనే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్(KCR)ది అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తి బీఆర్ఎస్(BRS) పార్టీది అని తెలిపారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ (BRS) పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ కేసీఆర్(kcr) అంటూ విమర్శించారు.
Also Read: Telangana: విశ్వవిద్యాలయాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం