German Content Creater: జర్మనీకి చెందిన టిక్‌టాక్ స్టార్ (German Tiktoker) నోయెల్ రాబిన్సన్ (Noel Robinson) ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నాడు. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో అతడికి ఛేదు అనుభవం ఎదురైంది. అనుమతి లేకుండా రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండటంతో అతడ్ని పోలీసులు జీపులోకి ఎక్కించి.. బలవంతంగా స్టేషన్ కు లాకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
స్వయంగా షేర్ చేసి..
పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను టిక్ టాక్ స్టార్ నోయెల్ రాబిన్సన్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో షేర్ చేశారు. ఆ ఛేదు అనుభవానికి సంబంధించిన వివరాలను తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. రాబిన్సన్ ప్రకారం.. అతడ్ని సుమారు 15 నిమిషాల పాటు పోలీసు స్టేషన్ లో ఉంచారు. అనుమతి లేకుండా షూట్ చేసినందుకు జరిమానా సైతం విధించారు. ‘ఇది నా జీవితంలో మొదటి సారి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన సందర్భం. జైల్లో పెడతారేమో అనిపించింది కానీ అదృష్టవశాత్తూ అంతా సవ్యంగా ముగిసింది. నేను సేఫ్‌గానే ఉన్నాను. నాకు భారత్ అంటే చాలా ఇష్టం’ అంటూ రాబిన్సన్ చెప్పుకొచ్చాడు.
నెటిజన్లు ఏమంటున్నారంటే?
మరోవైపు నోయెల్ రాబిన్సన్ ఎదురైన ఛేదు అనుభవం గురించి నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ‘కర్ణాటక తరపున క్షమాపణలు’ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు. ‘అరెస్ట్ చేయడం తప్పుకాదు. ప్రతీ ఒక్కరు చట్టానికి లోబడి ఉండాల్సిందే. అయితే రాబిన్సన్ ను జీపులోకి తోసేయడం అవసరమా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇంకొందరు రాబిన్సన్ చేసింది పెద్ద తప్పుకాదని అభిప్రాయపడ్డారు. స్థానిక చట్టాల గురించి అతడికి అవగాహన లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తించి ఉండొచ్చని సమర్థించారు. మెుత్తంగా జర్మనీ టిక్ టాకర్ కు ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తావిచ్చింది.
View this post on Instagram
Also Read: GHMC 1st Position: కుక్కల విషయంలో హైదరాబాద్ సంచలన రికార్డ్.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నోయెల్.. ఎలా పాపులరో తెలుసా?
జర్మనీ ఇన్ ఫ్లూయెన్సర్ నోయెల్ రాబిన్సన్ విషయానికి వస్తే అతడు తొలుత తన డాన్స్ క్లాసులు ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం ప్రారంభించాడు. తన ప్రత్యేకమైన డాన్స్ స్టైల్ (Afro hairstyle) కారణంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. హిప్‌హాప్ డాన్స్ లో అతడికి మంచి ప్రావిణ్యం ఉంది. 2022లో ఆఫ్రో స్టైల్ హెయిర్ కట్ ను జోడించి డ్యాన్స్ చేయడం ద్వారా మరింత పాపులారిటీని రాబిన్సన్ సొంతం చేసుకున్నాడు. ఆఫ్రో హెయిర్‌ను ప్రత్యేకంగా చూపించడం అతడి డ్యాన్స్ లో భాగంగా మారిపోయింది. కోవిడ్ సమయంలో ఇంటి నుంచి అతడు చేసిన ఓ వీడియో 40 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. అప్పటి నుంచే రాబిన్సన్ హెయిర్ స్టైల్ కూడా పాపులర్ అవ్వడం మెుదలైంది.