Nehru Family Protest: ములుగు మండల కేంద్రంకు చెందిన తిరుగుళ్ళ నెహ్రు హత్యకు గురైనట్లు తెలవడంతో మృతుని కుటుంబీకులు ములుగు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. హత్యకు బాధ్యుడని అనుమానం వ్యక్తం చేస్తూ వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Also Read: Powerstar Srinivasan: రూ. 5 కోట్ల మోసం కేసులో పవర్ స్టార్ అరెస్ట్?
చెరువులో మృతదేహం
ఈ మేరకు గ్రామానికి చెందిన మృతుని కుటుంబీకులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు నిరసనలో పాల్గొన్నారు. తిరుగుళ్ళ నెహ్రూ సోమవారం కనబడకుండా పోగా మద్దూరు మండలం గాగిల్లా పూర్ గ్రామ చెరువులో మృతదేహం దొరికింది. అతనికి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. కాగా ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి నిందితులను వెంటనే పట్టుకుని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
Also Read: Student Died: హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి